మోడీ.. త‌న త‌ప్పును రాష్ట్రాల‌పై రుద్దేశారే!

Update: 2021-08-31 17:30 GMT
ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీపై బీజేపీయేతర అధికార ప‌క్షాలు తీవ్ర ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నాయి. ``మీరు చేసిన త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు మ‌మ్మ‌ల్ని బ‌లి చేస్తారా?`` అంటూ.. వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఎందు కంటే.. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా పెట్రోల్ ధ‌ర‌లు ఆకాశానికి అంటాయి. దీంతో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గ‌డిచిన ఏడాది క‌రోనాతో ఉపాధి కోల్పోయిన వారు.. పారిశ్రామికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి ఈ పెట్రో భారం భారీగా ఉంది. అయితే.. ఇక్క‌డ ఇంకో విష‌యం ఏంటంటే.. పెట్రో ధ‌ర‌లు పెర‌గ‌డంతో ఈ ప్ర‌భావం ఇత‌ర అంశాల‌పైనా ప‌డింది.

దీంతో నిత్యావ‌స‌రాల నుంచి ఇత‌ర వ‌స్తువుల ధ‌ర‌లు ఆకాశానికి అంటాయి. ఈ ప్ర‌భావంతో దేశ‌వ్యాప్తంగా ఉద్య‌మాలు చేసేందుకు ప్ర‌తిప‌క్ష పార్టీలు రెడీ అయ్యాయి. మ‌రోవైపు.. యూపీ స‌హా ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక ల‌కు ముహూర్తం త‌న్నుకొస్తోంది. ఈ నేప‌థ్యంలో పెట్రో సెగ పార్టీపైనా.. త‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్‌పైనా ప‌డుతోంద‌నే భ‌యం బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఈ సెగ నుంచి త‌ప్పించుకోవ‌డ‌మా? లేక ఈ మంట‌ల‌ను అన్ని పార్టీల‌కూ అంటించ‌డ‌మా? అనే వ్యూహాన్ని బీజేపీ నేత‌లు అమలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పైకి ఏమీ చెప్ప‌కుండానే.. పెట్రో పాపం మాదేకాదు.. అన్ని రాష్ట్రాలదీ అంటూ.. ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

ఈ ప్ర‌క‌ట‌న‌లో రాష్ట్రాలు, న‌గ‌రాలు, రాజ‌ధానుల్లోని పెట్రోల్ ధ‌ర‌లు గ‌డిచిన మూడు మాసాల్లో ఎలా పెరిగా యో.. గ‌త ఏడాది ఇదే స‌మ‌యంలో ఎలా ఉన్న‌యో.. మోడీ స‌ర్కారు వివ‌రించింది. ఈ క్ర‌మంలో తొలి రెండు రాష్ట్రాలూ.. ఏపీ, తెలంగాణ‌లే కావ‌డం గ‌మ‌నార్హం. వ్యాట్ స‌హా ఇత‌ర సెస్సులు పెంచి, ప్ర‌జ‌ల‌పై భారాలు మోపిన రాష్ట్రాల్లో ఏపీ.. తెలంగాణ వ‌రుస‌గా.. 1, 2 స్థానాల్లో ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇత‌ర బీజేపీయేత‌ర పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అంటే.. మొత్తంగా మోడీ త‌ప్పులు.. అంద‌రిపైనా రుద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని.. త‌నకు తాను జ‌వాబు చెప్పుకోవాల్సింది పోయి.. మిగిలిన వారు కూడా ``ఏం త‌క్కువ కాదు!`` అనే వ్యూహాన్ని అమ‌లు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

వాస్త‌వానికి పెట్రోల్‌పైనా.. డీజిల్‌పైనా.. వ్యాట్ స‌హా స్థానిక ప‌న్నులు విధించుకునే వెసులుబాటును క‌ల్పించింది కేంద్ర‌మే. అయితే.. హ‌ద్దు మీరితే.. నియంత్రించే అవ‌కాశం కూడా కేంద్రానికి ఉంది. కానీ, ఈ విష‌యంలో మోడీ నిర్లిప్త‌త‌తో ఉంటున్నారు. ఎందుకంటే.. క‌రోనా కార‌ణంగా.. త‌లెత్తిన ఆర్థిక ప‌రిస్థితుల నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాలు కేంద్రం ముందు.. త‌మ ఆర్థిక ప‌రిస్థితిని వివ‌రించి.. అప్పులు కోరుతున్నారు. ఈ క్ర‌మంలో నిధులు ఇచ్చేందుకు ఇష్ట‌ప‌డ‌ని మోడీ.. ఎంత అవ‌కాశం వ‌స్తే.. అంతా ప్ర‌జ‌ల నుంచి పిండుకునేందుకు రాష్ట్రాల‌కు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు త‌న‌దాకా వ‌చ్చేస‌రికి వేలు రాష్ట్రాల‌వైపు చూపిస్తున్నారు. మ‌రి ఇది.. మోడీకి మైన‌స్ అవుతుందా? ప్ల‌స్ అవుతుందా? చూడాలి.




Tags:    

Similar News