మోడీని ట్వీట్ తో ఏసుకున్న కేజ్రీవాల్‌

Update: 2016-07-21 09:49 GMT
రాజ‌కీయాలు అన్నాక విభేదాలు మామూలే. అయితే.. శృతి మించిన స్థాయిలోనే ఉండ‌కూడ‌దు. అయితే.. మ‌రే రాష్ట్ర ముఖ్య‌మంత్రితో లేని రీతిలో ప్ర‌ధాని మోడీకి ఢిల్లీ సీఎంతో ఉన్న ల‌డాయి తెలిసిందే. కేజ్రీవాల్ గురించి మోడీ ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క మాట కూడా అనుచితంగా మాట్లాడ‌కున్నా.. కేజ్రీవాల్ పై ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు చేస్తుంటారు. తాజాగా.. మోడీపై ఒక షాకింగ్ ట్వీట్ చేశారు కేజ్రీవాల్‌.

త‌న మంత్రివ‌ర్గంలో విద్యామంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన మ‌నీష్ సిసోడియా తాజాగా కొత్త‌గా నిర్మించిన ఒక కాలేజీ భ‌వ‌నాన్ని ప్రారంభించారు. ఈ ఉదంతంపై త‌న‌దైన శైలిలో ట్వీట్ చేసిన కేజ్రీవాల్‌.. సిసోడియా.. సీబీఐ వ‌స్తోంది జాగ్ర‌త్త అంటూ ట్వీట్ చేశారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లో ప్ర‌ధాని మోడీ త‌నకున్న అధికారాన్ని రాజకీయ ప్ర‌తీకారం కోసం వాడుకుంటున్న‌ట్లుగా ఉండ‌టం గ‌మ‌నార్హం. ప‌శ్చిమ ఢిల్లీలోని ద్వార‌కా లోని దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ క‌ళాశాల‌లో కొత్త భ‌వ‌నాలు నిర్మించారు. వీటిని తాజాగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుడిని ఉద్దేశించి ట్వీట్ చేస్తూ.. సిసోడియా రెఢీగా ఉండు. మోడీ నీపైకి సీబీఐని పంపించ‌టం లేదంటే అస‌లు భ‌వ‌నాలు నిర్మించే అధికారం నీకు లేద‌ని కానీ ప్ర‌క‌టిస్తారంటూ త‌న ఎట‌కారం మొత్తాన్ని ట్వీట్ రూపంలో గుది గుచ్చి సోష‌ల్ మీడియాలోకి వ‌ద‌ల‌టం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News