పాకిస్థాన్ పద్ధతి చూస్తుంటే నోటితో నవ్వి నొసటితో వెక్కిరిస్తున్నట్లుగా ఉంది. ఓవైపు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ మన ప్రధాని మోడీతో భేటీ అయి గంటకుపైగా మాట్లాడగా.. మరోవైపు బోర్డర్‌లో మాత్రం పాకిస్థాన్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. ఇద్దరు ప్రధానులు భేటీ సమయంలోనే పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడింది. బారాముల్లా సెక్టారులోని నౌగావ్ లో కాల్పులు జరిపింది. ఈ దాడిలో బీఎస్‌ఎఫ్ జవాను ఒకరు ప్రాణాలు కోల్పోవాల్సివచ్చింది.
మోడీ, షరీఫ్‌లు శుక్రవారం ఉదయం రష్యాలో సమావేశమయ్యారు. వీరిద్దరి భేటీ ముందుగా అనుకున్న సమయం కంటే ఎక్కువసేపు కొనసాగింది. సుమారు గంటకు పైగా వీరిద్దరూ వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. సరిహద్దు వివాదం, ఉగ్రవాదం తదితర అంశాలు వీరిమధ్య చర్చకొచ్చాయి. గురువారం రాత్రి రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇచ్చిన విందులోనూ వీరు పాల్గన్నారు. ముంబయి దాడుల కారకుడు లఖ్వీని పాక్ విడిచిపెట్టిన విషయాన్ని మోడీ షరీఫ్ వద్ద ప్రస్తావించారు. ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని ఇద్దరు ప్రధానులూ నిర్ణయించారు. కాగా పాక్‌లో నిర్వహించనున్న సార్క్ సదస్సుకు మోడీ రావాలంటూ షరీఫ్ ఆహ్వానించారు. అలాగే పాక్ చెరలో ఉన్న మత్స్యకారులను వారం రోజుల్లో విడుదల చేసేందుకు షరీఫ్ హామీ ఇచ్చారు. మోడీ, షరీప్‌లు గత ఏడాది కాలంలో కలుసుకోవడం ఇది రెండోసారి. గత ఏడాది నవంబరులో వీరిద్దరూ ఖాట్మండులో కలుసుకున్నా అప్పుడు ప్రత్యేకంగా సమావేశమేమీ జరగలేదు.
అయితే... పాకిస్తాన్ ఇలా ద్వైపాక్షిక సంబంధాల పేరుతో మనతో చర్చలు జరుపుతూనే మరోవైపు కాల్పులు, దాడులకు తెగబడుతుండడంపై భారత్‌లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్ తీరు మోడీతో దోస్తీ చేస్తాం... భారత్‌తో కుస్తీ పడతాం అన్నట్లుగా ఉందంటున్నారు.