నెలకు ఐదు వేలు జీతం వచ్చేటోడు.. ఐదు లక్షల జీతం వచ్చేటోడు చేసే పని ఒక్కటే. ఆ నెలకు అయ్యే ఖర్చును వచ్చే ఆదాయం కంటే తక్కువగా ఉండేలా చూసుకోవటం.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వచ్చే ఆదాయంలో నాలుగు రూపాయిలు దాచుకోవటం చేస్తారు. వ్యక్తులుగానే ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వాలు మరెన్నిజాగ్రత్తలు తీసుకోవాలి? మన వెనుకటోళ్లు జాగ్రత్తగా దాచి ఉంచిన ఆస్తుల్ని ఎడాపెడా అమ్మకానికి పెట్టేస్తే ఎలా? భారత్ వెలిగిపోతోంది? దేశం దూసుకెళ్లిపోతోందన్న మాటలు చెబుతూనే.. మరోవైపు ప్రభుత్వ ఆస్తుల్ని అదే పనిగా అమ్మకానికి పెట్టేస్తున్న వైనం చూస్తే నోట మాట రాని పరిస్థితి.
ఇప్పటికే ప్రభుత్వానికి చెందిన ఎల్ఐసీ.. బీఎస్ఎన్ఎల్.. ఉక్కు పరిశ్రమ.. పోర్టులు.. ఎయిర్ పోర్టులు.. ఇలా చెప్పుకుంటూ పోతే అది ఇది కాదు.. ఏదైనా అన్నట్లుగా అమ్మకానికిపెట్టేస్తున్న వైనం తెలిసిందే. ఇది సరిపోదన్నట్లు ఇప్పుడు రోడ్లను కూడా అమ్మకానికి పెట్టేసిన వైనం తెలిస్తే నోట మాట రాకుండా పోతుంది. అదనపు ఆదాయం కోసం ఏది పడితే దాన్ని ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకు వీలుగా మోడీ సర్కారు గేట్లు ఎత్తేస్తున్న వైనం చూస్తే.. ఇదెక్కడి మహా సేల్ మోడీ అన్న మాట మనసులోకి రాకుండా ఉండదు.
పెద్దగా ఆదాయం రాని.. వినియోగంలో లేని ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేటుకు అప్పగించేందుకు కేంద్రంలోని మోడీ సర్కారు రెఢీ అయ్యింది. రానున్న నాలుగేళ్ల వ్యవధిలో రూ.6లక్షల కోట్లను సమీకరించటమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందు కోసం భారీ ప్లాన్ ను సిద్ధం చేసింది. నూతన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా ఉపాధి అవకాశాలను, అత్యధిక ఆర్థికాభివృద్దిని సాధించడం, గ్రామీణ- సెమీ అర్బన్ ప్రాంతాలను నిరంతరం విలీనం చేయడం ద్వారా సమగ్ర ప్రజా సంక్షేమం సాధించడం తమ లక్ష్యమని చెబుతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
రహదారులు, రవాణా, రైల్వే, విద్యుత్తు, సహజవాయువు, పౌర విమానయానం, షిప్పింగ్, రేవులు, జల మార్గాలు, టెలీకమ్యూనికేషన్లు, ఆహారం, ప్రజాపంపిణీ, మైనింగ్, బొగ్గు, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు మొదలైన ఇరవైకి పైగా రంగాల్లో సర్కారీ వారి ఆస్తుల్ని నగదుగా మార్చే ప్రోగ్రాం జరుగుతుందని ఆమె చెబుతున్నారు. ఆయా ఆస్తులపై యాజమాన్య హక్కులు ప్రభుత్వానివేనని.. నిర్ణీత కాలం తర్వాత ప్రైవేటు భాగస్వామి ఆస్తిహక్కును ప్రభుత్వానికి తిరిగి అప్పగించటం తప్పనిసరి అవుతుందని చెబుతున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.89వేల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవటం గమనార్హం. మిగిలిన మూడేళ్లలో రూ.1.62 లక్షల కోట్లు.. రూ.1.79లక్షల కోట్లు.. రూ.1.67లక్షల కోట్ల ఆదాయాన్ని టార్గెట్ గా పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ఇంత భారీగా ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే.. దాన్ని ప్రైవేటుకు అప్పజెప్పినప్పుడు.. వారు బాదే బాదుడు ప్రజల నడ్డి విరిగిపోతుందన్నది మర్చిపోకూడదు. ఉదాహరణకు టోల్ గేట్లే తీసుకుంటే.. గతంలో అంటే ముప్ఫై ఏళ్ల క్రితానికి ఇప్పటికి మధ్య తేడా చూస్తేనే ఉన్నాం. వాహనంలో మూడు వందల కిలోమీటర్లు ప్రయాణించాలంటే మధ్యలో పెరిగిన టోల్ గేట్లు ఎన్నో మనకు తెలిసిందే. వాటికి అయ్యే ఖర్చు మన జేబుల్లో నుంచే తీస్తున్నాం. ఈ లెక్కన రాబోయే రోజుల్లో మరెంత భారీగా టోల్ కట్టాల్సిందో చెప్పలేని పరిస్థితి.
ప్రభుత్వం సమీకరించాలనుకుంటున్న భారీ మొత్తాన్ని ఏయే రంగాలకు నుంచి తీసుకొస్తారన్న విషయాన్ని చూస్తే.. మొత్తం ఐదు రంగాల నుంచి 80 శాతం ఆదాయాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందులో కీలకం రోడ్లు 27 శాతం ఉంటే.. రెండోస్థానంలో రైళ్లు ఉన్నాయి. వీటినుంచి 25 శాతం.. విద్యుత్తు ద్వారా 15 శాతం చమురు..సహజవాయువు పైప్ లైన్ల ద్వారా 8 శాతం..టెలికాం నుంచి ఐదు శాతం ఆదాయాన్ని తీసుకొచ్చేలా ప్లాన్ చేశారు.