మోడీ నోట మహాప్రస్థానం

Update: 2015-10-22 07:39 GMT
దేశ ప్రధాని మోడీ బీజేపీ నేత.. బీజేపీ అంటే రైటిస్టు పార్టీ. అలాంటి మోడీ నోట వామపక్షభావజాలం, విప్లవ భావాలు నిండా నింపుకొన్న మహాకవి శ్రీశ్రీ కవిత పలికింది.  పార్లమెంటు ప్రాంగణంలోని మట్టిని ఏపీ రాజధాని అమరావతి కోసం తెచ్చిన మోడీ... దానిని సమర్పిస్తున్న సమయంలో శ్రీశ్రీ రాసిన నైను సైతం కవితను ప్రస్తావిస్తూ అదే తరహాలో ‘‘నైను సైతం ప్రజారాజధానికి మట్టిని సమర్పిస్తున్నాను ’’ అంటూ తెలుగులో అన్నారు. దీంతో ఎవరూ ఊహించని విధంగా అమరావతిలో మహాకవి నామస్మరణ జరిగింది.

తెలుగు సాహిత్య చరిత్రలోనే తిరుగులేని స్థానం సంపాదించుకున్న శ్రీశ్రీ మహాప్రస్థానంలోని కవితను ప్రధాని ప్రస్తావించడంతో దేశమంతా శ్రీశ్రీని మరోసారి గుర్తుచేసుకుంటోంది.  శ్రీశ్రీ మహా ప్రస్థానాన్ని తెలుగులోనే రాసినా పలు ఇతర భాషల్లోకీ అది అనువాదమైంది.  అలాంటి శ్రీశ్రీ కవితను ప్రధాని చదవడం ఆసక్తి కలిగించింది.

శ్రీశ్రీని విప్లవ కవి అనే కంటే ప్రజా కవి అని కూడా అని చెప్పొచ్చు. ప్రజా రాజధానిగా నిర్మితమవుతున్న అమరావతిలో ప్రజా కవి వాక్కులు ప్రధాని నోట ప్రతిధ్వనించడం శుభపరిణామమే.
Tags:    

Similar News