వైజాగ్ - విజయనగరం వందే భారత్ టికెట్ అంతనా?

విశాఖ నుంచి విజయనగరానికి రూ435 కాగా.. పార్వతీపురం స్టేషన్ కు రూ.565, రాయగడ స్టేషన్ కు రూ.640, రాయ్ పూర్ కు రూ.1435, దుర్గ్ కు రూ.1495గా నిర్ణయించారు.

Update: 2024-09-21 04:38 GMT

మోడీ కలల రూపంగా చెప్పే వందే భారత్ ట్రైన్ లో ప్రయాణం సామాన్యుడు మాత్రమే కాదు మధ్యతరగతి జీవి సైతం కాలు పెట్టేందుకు అవకాశం లేనట్లుగా మారింది. దీని ధరలపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ మధ్యనే విశాఖపట్నం -దుర్గ్ మధ్యన మొదలైన వందే భారత్ ట్రైన్ టికెట్ ధర గురించి తెలిసిన వారంతా అవాక్కు అవుతున్నారు. కేవలం 60కి.మీ. దూరానికి ఇంత భారీ ఛార్జినా అంటూ బెంబేలెత్తుతున్నారు.

విశాఖపట్నం - విజయనగరం మధ్య దూరం 60కిలోమీటర్లు మాత్రమే. ఈ దూరానికి వందే భారత్ లో ఛైర్ కార్ ఛార్జీ రూ.435గా డిసైడ్ చేస్తే.. ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ లో రూ.820గా నిర్ణయించారు. సాధారణంగా డీలక్స్ బస్సుల్లో రూ.100ఛార్జి ఉంది. అంటే.. బస్సు టికెట్ తో పోలిస్తే వందే భారత్ ట్రైన్ టికెట్ ఏకంగా నాలుగు రెట్లు ఉండటం గమనార్హం.

వందే భారత్ ట్రైన్ టికెట్ ధరల్ని చూసినప్పుడు తక్కువ దూరానికి ఈ ట్రైన్ లో ప్రయాణం భారమన్న మాట బలంగా వినిపిస్తోంది. ఎంత సమయం ఆదా అవుతుందన్న మాట చెప్పినా.. కాస్తంత సబబుగా ధరలు ఉండాలన్న మాట వినిపిస్తోంది.

విశాఖపట్నం - దుర్గ్ మధ్య టికెట్ ధరల్ని స్టేషన్ల వారీగా చూస్తే.. విశాఖ నుంచి విజయనగరానికి రూ435 కాగా.. పార్వతీపురం స్టేషన్ కు రూ.565, రాయగడ స్టేషన్ కు రూ.640, రాయ్ పూర్ కు రూ.1435, దుర్గ్ కు రూ.1495గా నిర్ణయించారు. భారీగా ఉన్న ఈ ధరలతో వందే భారత్ ఎక్కేందుకు పెద్ద ఆసక్తి చూపరన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News