‘‘అందరికీ విజయదశమి శుభాకాంక్షలు’’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆయన విజయదశమి పర్వదినం రోజున, దేవీ నవరాత్రి ఉపవాసాలు పూర్తి చేసుకున్న శుభ తరుణాన ఏపీ కొత్త చరిత్ర సృష్టించేందుకు శ్రీకారం చుట్టిందని అన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆశల కేంద్ర బిందువుగా ప్రజా రాజధానిగా రూపుదిద్దుకుంటుందని ఆయన ఆకాంక్షించారు. ఏపీలో అధికారం చేపట్టని ఇంత తక్కువ కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంతటి బృహత్కార్యాన్ని సాకారం చేసినందుకు ఆయనను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాని మోడీ అన్నారు.
స్వాతంత్యం వచ్చిన తరువాత నిర్మితమౌతున్న తొలి రాజధాని నగరం అమరావతేనని మోడీ అన్నారు. దేశంలో పట్టణీకరణ దిశగా సరైన శ్రద్ధ తీసుకోనందువల్ల వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైందని.. ఇంతవరకు ఒక్కటి కూడా గొప్ప నగరం నిర్మితం కాలేదన్నారు. అమరావతితో ఆ లోటు తీరుతుందని మోడీ అన్నారు. పట్టణీకరణ సమస్యగా కాకుండా అవసరంగా గుర్తించి ముందుకు సాగాలని సలహా ఇచ్చారు.