ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిజంగా భిన్నమైన వ్యక్తిత్వం గల నాయకుడు. దేశంలోని సంప్రదాయ రాజకీయనాయకులకు భిన్నమైన ఆలోచన దోరణి కలిగి ఉంది కాబట్టే మోడీ ప్రపంచ దేశాలను ఆకర్షించగలుగుతున్నాడు. ఈ క్రమంలో ఆయన ప్రపంచ దిగ్గజాలయిన అమెరికా - బ్రిటన్ - రష్యా దేశాల అధినేతలకు సన్నిహితుడు కాగలుగుతున్నారు. తాజాగా బ్రిటన్ పర్యటనలో ఉన్న మోడీ...తన మనోవాంచకు భిన్నంగా వ్యవహరించలేనని బ్రిటన్ వేదికగా స్పష్టం చేశారు.
బ్రిటన్ లో మూడురోజుల అధికార పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ బ్రిటిష్ పార్లమెంటులో ప్రసంగిస్తూ, టెర్రరిజాన్ని ఎదిరించే విషయంలో ప్రపంచం ఏకతాటి మీదకు రావాలని పిలుపునిచ్చారు.టెర్రరిజానికి వ్యతిరేకంగా చిత్తశుద్ధితో పోరాడే దేశాలకు చేయూతనిందించాలని సూచించారు. టెర్రరిజాన్ని ఈ యుగపు సవాలుగా అభివర్ణించారు. టెర్రరిస్టు గ్రూపుల మధ్య తేడాలు చూడరాదని చెప్పారు. పాకిస్థాన్ ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రధాని విమర్శలు ఎక్కుపెట్టారు. తీవ్రవాదం అధికంగా ఉన్న దేశాల్లో దానికి వ్యతిరేకంగా సామాజిక ఉద్యమం చేపట్టాలని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా మతాన్ని, టెర్రరిజాన్ని వేరుచేయడానికి కృషి జరగాల్సి ఉందన్నారు. ఐక్యరాజ్యసమితిలో టెర్రరిజంపై సమగ్ర అంతర్జాతీయ ఒప్పందం కోసం ఏమాత్రం ఆలస్యం లేకుండా కృషి జరగాలన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించే దేశాలను ఏకాకులను చేయాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్రమోడీ నొక్కిచెప్పారు.
బ్రిటిష్ పార్లమెంటులో ప్రసంగించడం అనేది తనకు దక్కిన సిసలైన గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. నేటి గ్లోబలైజేషన్ ప్రపంచంలోనూ లండన్ స్థాయి లండన్‌దేనని అన్నారు. భారత్ లో కొత్తగాలులు వీస్తున్నాయని, వచ్చి చూస్తే మీకే తెలుస్తుందని చెప్పారు. భారత్‌లో సమాఖ్య విధానం కొత్త నిర్వచనాన్ని సంతరించుకుంటున్నదని, టీమిండియా స్ఫూర్తితో ముందుకు సాగుతున్నదని తెలిపారు.
ప్రపంచ వేదికగ టెర్రరిజం మాట్లాడుతున్నారనే విమర్శకుల అభిప్రాయాలు సర్వసాధరణమే అయినప్పటికీ ఏ వేదిక అయినప్పటికీ రాక్షసత్వాన్ని ఎండగట్టడంలో తప్పేంలేదు కదా?!