కరోనా వ్యాక్సిన్ పై ప్రధాని స్పెషల్ ఇంట్రస్ట్.. ఏం చేస్తున్నారంటే!
దేశాన్ని అన్ని విధాలా ఇబ్బందికి గురి చేసిన కరోనా వైరస్ ను అంతమొందించేందుకు వ్యాక్సిన్ తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు దశల ప్రయోగాలు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా సీరమ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో ముందున్న భారత్ బయోటెక్.. త్వరలోనే దీనిని ప్రజలకు అందిం చేందుకు సిద్ధమవుతోంది. అయితే.. ఈ విషయంలో నిరంతరం శాస్త్రవేత్తల కన్నా ఎక్కువగా ప్రధాని మోడీ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. నిరంతరం .. శాస్త్రవేత్తలతో ఆయన టచ్‌లోకి వస్తున్నారు. ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నారు.
ఇటీవల హైదరాబాద్, పుణే, గుజరాత్‌లలోని వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను సుడిగాలి పర్యటన చేసిన పరిశీలించిన ప్రధాని.. శాస్త్రవేత్తల కృషిని అభినందించారు. వారికి కొన్ని దిశానిర్దేశాలు కూడా చేశారు. ఇక, రాష్ట్రాలను కూడా ఆయన అప్రమత్తం చేశారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకూ వ్యాక్సిన్ భద్రపరుచుకునే విధానాలపై వివరించారు. ముఖ్యమంత్రులతోనూ బేటీ అయి.. వ్యాక్సిన్ వివరాలను అందించారు. ముందుగా ఎవరికి ఇవ్వాలి..? ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు ఏం చేయాలి? వంటి అనేక విషయాలను మోడీ చర్చించారు. ఇక, అక్కడితో ఆయన ఆగిపోలేదు. ప్రతి పూటా వ్యాక్సిన్ తయారీ అప్‌డేట్లను తెలుసుకుంటున్నారు.
దీనిలో భాగంగా.. మోడీ.. వ్యాక్సిన్ రవాణా, భద్రత, పంపిణీపై ఆయా తయారీ సంస్థలతో నూ చర్చించారు. కరోనా టీకా రెగ్యులేటరీ ప్రక్రియపై ఆయన కొన్ని సలహాలు, సూచనలు చేయడంతోపాటు శాస్త్రవేత్తల నుంచి కూడా ఆయా అంశాలపై సూచనలు కోరినట్టు ప్రధాని కార్యాలయ అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ అభివృద్ధికి జెనోవా బయో ఫార్మా, బయోలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని మోడీ అభినందించారు. ఇక, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. కరోనా వ్యాప్తి మాత్రం మరోసారి పెరిగే అవకాశం కనిపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా కరోనా వ్యాక్సిన్‌పై ప్రధాని నరేంద్ర మోడీ.. మంచి శ్రద్ధనే కనబరుస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు.
కొసమెరుపు: అయితే.. మన దేశంలో ఏ నాయకుడు ఏం చేసినా.. రాజకీయంగా కూడా కారణం ఉంటుందనేది వాస్తవం. దీనిలో భాగంగానే ప్రధాని మోడీ.. వ్యాక్సిన్‌పై చూపిస్తున్న ఇంట్రస్ట్ వెనుక.. త్వరలోనే జరగనున్న(వచ్చే ఏడాది) తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని కూడా విశ్లేషణలు వస్తుండడం గమనార్హం. ఆ ఎన్నికల్లో ప్రతిపక్షాలు బీజేపీపై వ్యాక్సిన్ రాజకీయాలు చేయవచ్చని.. అప్పటిలోగానే వ్యాక్సిన్‌ను తీసుకువచ్చి ప్రజలకు అందించే వ్యూహంతోనే మోడీ ఇలా చేస్తున్నారనే వారు కూడా ఉండడం గమనార్హం. ఏదేమైనా... ప్రజలకైతే.. మంచే జరుగుతోందని మరికిందరు వ్యాఖ్యానిస్తున్నారు.