అక్క‌డ మోడీ.. ఇక్క‌డ జ‌గ‌న్‌... సేమ్ టు సేమ్ రాజ‌కీయం!

Update: 2022-02-07 13:30 GMT
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏమైనా జ‌ర‌గొచ్చు.. అయితే.. ఒక‌రికి భిన్నంగా ఒక‌రు రాజ‌కీయాలు చేస్తారు. కానీ.. ఏపీలోను.. అటు ఢిల్లీలోనూ జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. సేమ్ టు సేమ్ రాజ‌కీయా లు క‌నిపిస్తున్నాయి. ఢిల్లీలోని మోడీ ప్ర‌బుత్వం.. ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వాలు.. రాజ‌కీయంగా వేర్వేరు పార్టీలు.. అయిన‌ప్ప‌టికీ.. అనుస‌రిస్తున్న కొన్ని పంథాల‌ను గ‌మ‌నిస్తే.. బుగ్గ‌లు నొక్కుకోవ‌డం ఖాయం. అవేంటో చూద్దాం...

మోడీ:  మోడీ హ‌యాం ఇప్ప‌టి వ‌ర‌కు ఏడున్న‌ర సంవ‌త్స‌రాలు అయింది. ఈ ఏడున్న‌రేళ్ల‌లో ఆయ‌న 70 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగానే అప్పులు చేశారు. అంత‌కుముందు.. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత‌.. ప్ర‌భుత్వాలు చేసిన అప్పులు.. 40 ల‌క్ష‌ల కోట్లు. కానీ, మోడీ హ‌యాంలో మాత్రం ఏడున్న‌రేళ్ల‌లోనే 70 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేశారు.

జ‌గ‌న్‌: ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొలుదీరి రెండున్న‌రేళ్లు మాత్ర‌మే పూర్త‌యింది. అయితే.. ఈ రెండున్న రేళ్ల‌లో.. జ‌గ‌న్ ప్ర‌బుత్వం ఏకంగా 3.50 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసింది. గ‌త ప్ర‌భుత్వాల‌ను తీసుకుంటే.... అన్నీ క‌లిపి చేసిన అప్పులు.. కేవ‌లం 3 ల‌క్ష‌ల కోట్లు. అంటే.. జ‌గ‌న్ కేవ‌లం రెండున్న‌రేళ్ల‌లోనే.. మూడున్న‌ర ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేశారు.

మోడీ:  విప‌క్ష కాంగ్రెస్‌ను ఎంతగా అణిచి వేయాలో అంతా అణిచి వేస్తున్నారు. ముఖ్యంగా దేశంలో ఇందిర‌మ్మ, రాజీవ్ గాంధీల పేర్ల‌తో ఉన్న ప‌థ‌కాల‌ను దాదాపు నిలిపివేశారు. అంతేకాదు.. ఒక‌వేళ ఆయా ప‌థ‌కాల‌ను లేదా ప్రాజెక్టుల‌ను కొన‌సాగించ‌క త‌ప్ప‌ద‌ని భావిస్తే.. వాటికి ఉన్న పేర్ల‌ను మార్చేస్తున్నారు. అత్యంత కీల‌క‌మైన రాజీవ్‌గాంధీ ఖేల్ ర‌త్న పుర‌స్కారం పేరును ధ్యాన్‌చంద్ పేరిట మార్చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ హ‌యాంలో ఏర్పాటు చేసిన అమ‌ర జ్యోతిని మార్చేశారు. ఇలా.. అనేక ప‌థ‌కాల‌కు పేర్ల‌ను మార్చేశారు. ఇందిరా వికాస్ ప‌త్రాల‌ను... నేష‌న‌ల్ సెక్యూరిటీ ప‌త్రాలుగా మార్చేశారు.

జ‌గ‌న్‌:  ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీపై త‌న ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ పార్టీ ప్ర‌భుత్వం ప్రారంభించిన అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను నిలిపివేశారు. కీల‌క‌మైన అన్న క్యాంటిన్ల‌ను ఆపివేశారు. ముస్లింల‌కు ఇచ్చే చంద్ర‌న్న తోఫా స‌హా అన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను నిలిపివేశారు. టీడీపీ హ‌యాంలో నిర్మించిన భ‌వ‌నాల‌ను కూల్చేశారు. చంద్ర‌బాబు హ‌యంలో ప్ర‌తిపాదించిన రాజ‌ధానిని ప‌క్క‌న పెట్టారు. ఇలా.. అనేక రూపాల్లో విపక్షం పేరు వినిపించ‌కూడదు.. అనే రేంజ్‌లో ఇక్క‌డ జ‌గ‌న్ పాల‌న చేస్తుండ‌డం గ‌మ‌న‌నార్హం.

కొస‌మెరుపు: చిత్రం ఏంటంటే.. మ‌హాత్మా గాంధీ వార‌సుల‌ను,, ఆయ‌న సానుభూతిని, ఆయ‌న ఓటు బ్యాంకును మోడీ త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గాంధీకి కాంగ్రెస్ హ‌యాంలో స‌రైన గౌర‌వం ద‌క్క‌లేద‌ని ఆయ‌న చెబుతున్నారు. క‌ట్ చేస్తే..ఏపీలోనూ టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ సానుభూతిని, ఆయ‌న ఓటు బ్యాంకును జ‌గ‌న్ త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అంతేకాదు.. చంద్ర‌బాబు హ‌యాంలో ఎన్టీఆర్‌ను ప‌ట్టించుకోలేద‌ని.. ఈయ‌న కూడా ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రి అటు ఢిల్లీకి, ఇటు ఏపీకి.. ఇవి ఏమేర‌కు మేలు చేస్తాయో.. చూడాలి.
Tags:    

Similar News