వారణాసిలో.. మోడీకి దిమ్మ తిరిగే షాక్?

Update: 2017-03-01 05:53 GMT
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం ఎంతలా ఉంటాయన్న విషయంలో ఇప్పటికే కొద్దిపాటి క్లారిటీ ఉందని చెప్పాలి. అయితే.. ఈ ఫలితాల ముచ్చట ఎలా ఉన్నా.. ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మోడీ ఏ మాత్రం మింగుడుపడలేని రీతిలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం ఇస్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది. మిగిలిన చోట్ల విజయాల మాట ఎలా ఉన్నా.. సొంత అడ్డాలో మోడీకి తాజా ఎన్నికలు ఎదురుదెబ్బ వేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఎందుకలా అంటే.. చాలానే కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.

మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నవారణాసి ఎంపీ సీటు పరిధిలో మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అవేమంటే.. 1. రొహానియా.. 2. వారణాసి నార్త్.. 3. వారణాసి సౌత్.. 4. వారణాసి కంటోన్మెంట్.. 5. సేవాపురి అసెంబ్లీస్థానాలు ఉన్నాయి. వీటిల్లో రెండు స్థానాలు బీఎస్పీ.. ఎస్పీ చేతుల్లో ఉండగా.. మిగిలిన మూడుస్థానాల్లో బీజేపీ ఎమ్మెల్యేలే ఉన్నారు.  2014 ఎన్నికల్లో మోడీ ఎంపీగా బంపర్ మెజార్టీతో విజయం సాధించిన నేపథ్యంలో.. ఈ ఐదు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం పక్కా అని అనుకున్నారంతా.

కానీ.. మారిన పరిణామాలు.. మోడీ తీసుకున్న నిర్ణయాలతోపాటు.. పార్టీ.. సంఘ్ కారణంగా మోడీకి ఊహించని షాక్ ఇచ్చేలా ఎన్నికల ఫలితాలు రానున్నట్లుగా చెబుతుననారు. సిట్టింగ్ అభ్యర్థుల్ని మార్చటం.. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకే టికెట్లు ఇవ్వటం.. మితిమీరిన ఆర్ ఎస్ ఎస్ జోక్యంతో పాటు.. స్థానిక సెంటిమెంట్లను దెబ్బ తీసేలా మోడీ తీసుకున్నకొన్నినిర్ణయాలు ఉండటంతో.. ఐదు అసెంబ్లీస్థానాలు ఈసారి బీజేపీకి వచ్చే ఛాన్సే లేదని చెబుతున్నారు.

బీఎస్పీ.. ఎస్పీ ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు స్థానాల (సేవాపురి.. రొహానియా)తో పోలిస్తే.. వారణాసి సౌత్.. నార్త్.. కంటోన్మెంట్ మూడు నియోజకవర్గాలు బీజేపీకి కంచుకోటలుగా అభివర్ణిస్తుంటారు. అయితే.. ఈ మూడు చోట్లా అభ్యర్థుల ఎంపికతో పాటు.. స్థానికంగా ఉన్న అంశాల కారణంగా బీజేపీ నుంచి చేజారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అన్నింటికి మించి.. విజయం మీద ఉన్న ధీమాతో.. ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిని ప్రదర్శించలేదన్న మాట వినిపిస్తోంది. ఒకవేళ.. ఇప్పుడు వినిపిస్తున్న అంచనాలు కానీ నిజమైన పక్షంలో మోడీకి వ్యక్తిగతంగా పెద్ద డ్యామేజ్ కావటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తుది ఫలితం ఎలా ఉండనుందన్నది మరో పది రోజుల్లో తేలిపోనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News