ఆ దేశానికి మోడీ గిఫ్ట్‌..200 ఆవులు

Update: 2018-07-23 14:17 GMT

సుదీర్ఘ‌కాలం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఆఫ్రికన్ దేశాల పర్యటన పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల్లో ఐదు రోజుల పాటు పర్యటించనున్నారు. సౌతాఫ్రికా - ఉగాండా - రువాండా దేశాల్లో తిరగనున్నారు. మోడీ ఫస్ట్ టైం రువాండాకు వెళ్తున్నట్లు విదేశాంగ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ ఏ భారత ప్రధాని కూడా రువాండాలో పర్యటించలేదు. మన దేశ రాజధాని ఢిల్లీ కన్నా తక్కువ జనాభా ఉండే రువాండాలో పర్యటిస్తున్నమొదటి భారత ప్రధానిగా మోడీ నిలిచారు. 25 నుంచి 27 వరకు జరగనున్న బ్రిక్స్ దేశాల సమ్మిట్ లో ప్రధాని మోడీ పాల్గొంటారు.

అయితే, మూడు దేశాల ఆఫ్రికా పర్యటనలో భాగంగా మోడీ మొదటగా రువాండ దేశంలో అడుగు పెడుతున్నారు. ఆ దేశ జనాభా.. ఢిల్లీ కంటే తక్కువ. టూర్‌ లో భాగంగా ఉగాండా - రువాండా అధ్యక్షులతో ప్రత్యేకంగా ప్రధాని సమావేశం కానున్నారు.  ఆ దేశంలో దిగిన వెంటనే.. ఆ దేశ అధ్యక్షుడితో డిన్నర్‌ లో మోడీ పాల్గొనబోతున్నారు. అయితే ఈ టూర్‌లో ప్ర‌ధాని మోడీ ఓ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. భారత్ తరపున రువాండా దేశానికి 200 ఆవులను మోడీ బహుమతిగా ఇస్తున్నారు. మోడీ ఎందుకు ఆవుల‌ను ఇస్తున్నారంటే...దాని వెనుక ఆస‌క్తిక‌ర‌మైన కార‌ణం ఉంది. రువాండా దేశంలో కుటుంబానికో ఆవు అనే పథకం అమల్లో ఉంది. కనీస ఉపాధి కింద ఆ దేశ అధ్యక్షుడు ఈ స్కీమ్ తీసుకొచ్చారు. దీనిపేరు గిరింకా స్కీమ్. అందులో భాగంగా 200 కుటుంబాలకు మోడీ.. ఆవులను అందజేయనున్నారు. అదే విధంగా పలు ఒప్పందాలపైనా రెండు దేశాలు సంతకాలు చేయనున్నారు. రువాండా దేశానికి అవసరం అయిన మౌలిక వసతులు, అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం కాబోతుంది. రువాండా దేశానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడి పార్లమెంట్ లో ఎక్కువ మంది మహిళలే సభ్యులు. ప్రపంచంలోని ఏ పార్లమెంట్ లోనూ ఇంత మంది మహిళలకు ప్రాతినిధ్యం లేదు. రువాండలో 2/3 మంది మహిళలే ఉంటారు.

Tags:    

Similar News