టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చారు. గడిచిన ఏడాదిగా తన భర్త తీరుపై షమీ సతీమణి హసీన్ ఆరోపణలు చేయటం తెలిసిందే. భార్య ఆరోపణలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న షమీ.. తాజాగా తన రెండో పెళ్లిపై భార్య చేసిన ఆరోపణపై స్పందించాడు.
దీనిపై స్పందించిన షమీ.. మొదటి పెళ్లికి సంబంధించిన సమస్యలతోనే తానింకా సతమతమవుతున్నానని.. ఇక రెండో పెళ్లా? అన్న ఆయన.. నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. తాను కానీ పెళ్లి చేసుకుంటే హసీన్ జహాన్ ను తప్పనిసరిగా పిలుస్తానని అంతే ధీటుగా రియాక్ట్ అయ్యాడు. చూస్తుంటే.. భార్య చేసే ఆరోపణలకు ఎలా రియాక్ట్ కావాలన్నదానిపై షమీ కాస్త రాటు దేలినట్లు కనిపించట్లేదు? ఏడాది నుంచి ఎదురవుతున్న సవాళ్లు.. షమీ మాటల్ని మార్చాయంటున్నారు. గతంలో మాదిరి ఆగ్రహం చెందకుండా కూల్ గా పంచ్ లు వేస్తున్నారన్న అభిప్రాయం ఉంది.