టీమిండియా పేసర్ మహమ్మద్ షమి ప్రయాణిస్తున్న రోడ్డు ప్రమాదానికి గురైంది. డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా షమి ప్రయాణిస్తున్న కారు ను వేగంగా వెళ్తున్న ట్రక్కు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో షమి తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో అతడిని డెహ్రాడూన్ లోని ఓ ఆసుత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో షమీ తలకు గాయాలైనట్లు సమాచారం. డెహ్రాడూన్ లోని ఓ ఆసుపత్రిలో షమి చికిత్స పొందుతున్నాడు. షమి తలకు కుట్లు పడ్డాయని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు. డెహ్రాడూన్ ప్రాంతంలో అభిమన్యు క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవ వేడుకకు హాజరయ్యేందుకు షమి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కాగా, షమి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని, అతడు అలీష్బా అనే మహిళను దుబాయ్ లో కలిశాడని అతడి భార్య హసీన్ జహా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. షమికి పలువురు మహిళలతో సంబంధాలున్నాయని, అతడు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆమె కలకత్తా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఆరోపణలను షమి ఖండించాడు. మరోవైపు, షమి....మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడలేదని, బీసీసీఐ విచారణలో తేలడంతో అతడికి బీసీసీఐ....‘బి’ గ్రేడ్ కాంట్రాక్టు ఇచ్చింది. అంతేకాకుండా, ఈ ఏడాది ఐపీఎల్ లో షమి పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. బీసీసీఐ నిర్ణయం పట్ల షమి హర్షం వ్యక్తం చేశాడు.