ఆస్ట్రేలియాలో బలమైన ఆస్ట్రేలియా టీంను ఓడించి గర్వంగా దేశానికి టీమిండియా ఆటగాళ్లు తిరిగి వచ్చారు. ఇక తండ్రి చనిపోయినా కూడా వెరవకుండా మనోనిబ్బరంతో ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో టీమిండియా పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ అదరగొట్టాడు. లాస్ట్ టెస్టులో ఏకంగా 5 వికెట్లు తీసి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు.
గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో టీమిండియా బౌలింగ్ దళానికి సిరాజ్ నాయకుడిగా ముందుండి నడిపించాడు. అయితే ఈ పర్యటనకు ఎంపికై జట్టుతో కలిసి సిరాజ్ అసీస్ లో అడుగుపెట్టాడు. అయితే కొద్దిరోజులకే సిరాజ్ తండ్రి మమ్మద్ గౌజ్ మృతిచెందాడు. అయితే తండ్రి మరణంతో సిరాజ్ హైదరాబాద్ వస్తాడని అనుకున్నారు.
కానీ సిరాజ్ బాధను దిగమింగుకొని ఆస్ట్రేలియాలోనే ఉండి అద్భుతంగా రాణించాడు. టెస్ట్ సిరీస్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు. తాజాగా టీమిండియా ఈరోజు తిరిగి భారత్ కు చేరుకుంది.
సిరాజ్ కూడా హైదరాబాద్ వచ్చేశాడు. వచ్చి రాగానే సిరాజ్ తన తండ్రి సమాధిని దర్శించుకున్నాడు. 'టెస్టు జట్టుకు ఆడటం తన తండ్రి కల' అని అందుకే ఆయన కలను నెరవేర్చేందుకే రాలేకపోయానని సిరాజ్ ఆవేదన చెందాడు.