ప్రముఖుల తీరు కాస్త చిత్రంగా ఉంటుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వారికేమీ గుర్తుకు రావు. కానీ.. వారికి జరగాల్సిన మర్యాదల్లో కాస్త తేడా వచ్చినా అగ్గి ఫైర్ అయిపోతారు. తాజాగా అలానే ఫైర్ అయిపోయారు విలక్షణ నటుడు మోహన్ బాబు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలోని శ్రీవారిని దర్శించుకోవటానికి వచ్చిన ఆయనకు.. టీటీడీ అధికారుల తీరు అస్సలేమాత్రం నచ్చలేదు.
పండగపూట భారీగా రద్దీ నెలకొన్న నేపథ్యంలో మోహన్ బాబుకు కోరుకున్న రీతిలో టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేయలేకపోయారు. ఆలయ ప్రవేశం చేసే ముందు ప్రముఖులందరూ ధ్వజస్తంభాన్ని తాకేస్తుంటారు. నిజానికి ఇలాంటి అవకాశం ప్రముఖులకు మాత్రమే లభిస్తుంది. సామాన్యులకు ఇలాంటివి ఏ మాత్రం సాధ్యం కాదు.
పండగపూట భక్తులు భారీఎత్తున పోటెత్తిన వేళ.. ధ్వజస్తంభాన్ని తాకే అవకాశాన్ని మోహన్ బాబుకు అధికారులు కల్పించలేదు. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన.. ప్రభుత్వంపై మండిపడ్డారు. డబ్బున్నోళ్లకు మాత్రమే టీటీడీ అధికారులు మంచి దర్శనం కల్పిస్తున్నారని.. టీటీడీకి వచ్చిన ప్రతి అధికారీ తనకు నచ్చిన రీతిలో విధానాల్ని అమలు చేస్తున్నారని.. అన్నగారి హయాంలో మాదిరి తిరుమలలో పరిస్థితులు లేవని వ్యాఖ్యానించారు.
ఆలయ ప్రవేశం చేసే ముందు ధ్వజస్తంభాన్ని తాకటం ఒక సంప్రదాయం అని.. టీటీడీకి నచ్చినోళ్లకు మాత్రమే అలాంటి అవకాశం ఇస్తున్నారని.. ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే ధ్వజస్తంభం తాకాలని ఏ రాజ్యాంగంలో రాసి ఉందని మండిపడ్డారు. తిరుమలకు వచ్చినప్పుడంతా తనకు ఇలాంటి ఆవేదనే కలుగుతుందని ఫీలైయ్యారు. ఎంత ధ్వజస్తంభం తాకే అవకాశం రాకపోతే మాత్రం ఇంతగా ఫైర్ అవ్వాలా? అన్న ప్రశ్నను కొందరు వేస్తున్నారు. ఒక్కటి రెండుసార్లు ధ్వజస్తంభాన్ని తాకే అవకాశం దక్కకపోతేనే ఇంతగా కోపం వస్తే.. తమ జీవితకాలంలో అలాంటి అవకాశమే రాని కోట్లాది మంది పరిస్థితి ఏమిటో మోహన్ బాబుకు తెలుసా? అని నిలదీస్తున్నోళ్లు ఉన్నారు. మోహన్ బాబు లాంటోళ్లుకూడా డబ్బున్నోళ్లకే అన్న మాట వాడితే.. అసలు డబ్బున్నోళ్లంటే ఎవరన్న సందేహం కలగకమానదు.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/