21వ శతాబ్ధంలో వైరస్ ల దాడి ఎక్కువైంది. ఇప్పటికే కరోనాతో ఓ రెండేళ్ల పాటు జనాలు అష్టకష్టాలు పడ్డారు. ఏకంగా లాక్ డౌన్ పేరిట ఓ ఏడాది ఇంట్లో ఉన్నారు. కరోనా వైరస్ ధాటికి జనాలు ఎంతో మంది చనిపోయారు. కరోనాతో మొదలైన దాడులు కొత్తకొత్తగా రూపాంతరం చెందుతూ విరుచుకుపడుతూనే ఉన్నాయి. కరోనా తగ్గి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచాన్ని మరో వైరస్ భయపెడుతోంది.
ఇటీవల ప్రపంచ దేశాలను ‘మంకీపాక్స్’ వైరస్ కలవరపెడుతోంది. బ్రిటన్ లో వెలుగుచూసిన ఈ వైరస్ నెమ్మదిగా ఇతరదేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే 120కి పైగా కేసులు నమోదయ్యాయి. మరిన్ని కేసులు పరిశీలనలో ఉన్నాయి. దాంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.మే 7న బ్రిటన్ లో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్ ను కనుగొన్నారు. నైజీరియా నుంచి బ్రిటన్ కు వచ్చిన వ్యక్తిలో వైరస్ బయటపడింది. అప్పటి నుంచి బ్రిటన్ లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా 20కి ఆ సంఖ్య చేరుకుంది. స్పెయిన్ లోనూ ఇప్పటివరకూ 23 కేసులు వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికాలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. తాజాగా బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కూడా ఈ కేసుల జాబితాలో చేరిపోయాయి.
యూకే, అమెరికా, కెనడా, స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో పదుల సంఖ్యలో మంకీ పాక్స్ వైరస్ కేసులు నమోదయ్యాయి. కోతులు, ఎలుకలు, ఉడుతల ద్వారా వ్యాపించే ఈ వైరస్.. యూకేలో శృంగారం ద్వారా కూడా సోకుతుందని.. ముఖ్యంగా గే లేదా బైసెక్సువల్ మెన్ ల ద్వారా ఇది వ్యాపించడం ఆందోళన కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ వైరస్ సోకితే తలనొప్పి, చలి, కండరాల నొప్ప లాంటి లక్షణాలుంటాయి.
ప్రపంచదేశాలకు విస్తరిస్తున్న మంకీపాక్స్ వైరస్ తీవ్రత దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ వ్యాధిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మంకీపాక్స్ వ్యాప్తి కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యధిక హెచ్చరిక స్థాయిని ప్రకటించింది.. డబ్ల్యూహెచ్‌ఓ ఈ వైరస్‌ను అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.
మంకీపాక్స్ వ్యాప్తి ఇప్పుడు ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగా పరిగణించబడుతుంది. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఇది అవసరమని డబ్ల్యూ హెచ్ ఓ తెలిపింది. మహమ్మారి పెరగకుండా ఆపడమే లక్ష్యమని ప్రకటించింది.
గత కొన్ని వారాలుగా మంకీపాక్స్ ఇన్ఫెక్షన్లు అధిక స్థాయిలో పెరిగాయి. వేగంగా వ్యాప్తి చెందడంతో డబ్ల్యూ.హెచ్.వో అత్యవసర పరిస్థితిని ప్రకటించవలసి వచ్చింది.
ఈ ఏడాది ఇప్పటి వరకు 75 దేశాల్లో 16,000 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ధృవీకరించబడిన అంటువ్యాధులు జూన్ చివరి నుండి జూలై ప్రారంభం వరకు 77 శాతం పెరిగాయి.
అసహజ శృంగారం వల్ల మంకీపాక్స్ వ్యాధి వ్యాపిస్తున్నాయని తెలిసింది. అసహజ తిండివల్లేనే కరోనా సోకింది. ఇప్పుడు అసహజ శృంగారంతో ఇది వ్యాపించడం అందరినీ కంగారుపెడుతోంది. పురుషులతో సెక్స్ చేసే పురుషులు ప్రస్తుతం ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఆఫ్రికాలో ఐదు మరణాలు నమోదయ్యాయి. ఇది మరింతగా విస్తరిస్తుందని తెలిసి డబ్ల్యూ.హెచ్.వో ఈ ప్రకటన చేసింది.