సెక్స్ వల్లే మంకీపాక్స్ వ్యాప్తి అధికం: WHO

Update: 2022-06-09 05:30 GMT
21వ శతాబ్ధంలో మనిషిపై వైరస్ ల దాడి ఎక్కువైంది. కరోనాతో మొదలైన దాడులు కొత్తకొత్తగా రూపాంతరం చెందుతూ విరుచుకుపడుతూనే ఉన్నాయి. కరోనా తగ్గి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచాన్ని మరో వైరస్ భయపెడుతోంది.  ప్రస్తుతం ప్రపంచ దేశాలను ‘మంకీపాక్స్’ వైరస్ కలవరపెడుతోంది. బ్రిటన్ లో వెలుగుచూసిన ఈ వైరస్ నెమ్మదిగా ఇతరదేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే 120కి పైగా కేసులు నమోదయ్యాయి. మరిన్ని కేసులు పరిశీలనలో ఉన్నాయి. దాంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

మే 7న బ్రిటన్ లో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్ ను కనుగొన్నారు. నైజీరియా నుంచి బ్రిటన్ కు వచ్చిన వ్యక్తిలో వైరస్ బయటపడింది. అప్పటి నుంచి బ్రిటన్ లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఏకంగా 20కి ఆ సంఖ్య చేరుకుంది. స్పెయిన్ లోనూ ఇప్పటివరకూ 23 కేసులు వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికాలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. తాజాగా బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా కూడా ఈ కేసుల జాబితాలో చేరిపోయాయి.

మంకీపాక్స్ వైరస్ అధికంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే ప్రధాన కారణమని డబ్ల్యూ.హెచ్.వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు.మంకీపాక్స్ సోకిన వారు ఇతరులతో శారీరకంగా కలవడం.. వారికి దగ్గరగా ఉండడంతో వైరస్ వ్యాపిస్తుందని చెప్పారు. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు హోం ఐసోలేషన్ లో ఉండాలన్నారు. వ్యాక్సిన్లు, యాంటీ వైరల్ డ్రగ్స్ ఉన్నప్పటికీ అవి పరిమితంగా ఉన్నాయని తెలిపారు. 29 దేశాల్లో 1000 కేసులు వచ్చాయని తెలిపారు.

ఈ వైరస్ సోకిన వ్యక్తికి వచ్చిన పుండ్ల వల్ల.. లైంగిక చర్యల వల్ల ఇతరులకు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  చెబుతోంది. వ్యాధి బారినపడ్డ వారు ఉపయోగించిన వస్తువులను వాడినా వైరస్ సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీనికి చికెన్ పాక్స్ లక్షణాలే ఉంటాయని తెలిపారు.

గత  నెలరోజులుగా ఐరోపాలోని పోర్చుగల్, స్పెయిన్, బ్రిటన్ లో బయటపడ్డ అసాధారణ డజన్ల కొద్దీ మంకీపాక్స్ కేసులకు అసహజ లైంగిక కార్యకలాపాలే కారణమని వైద్యులు తెలిపారు. ఐరోపా కేసుల్లో గే సెక్స్ వ్యక్తులకే ఇది సోకిందని.. లైంగిక ధోరణితో సంబంధం లేకుండా ఎవరికైనా మంకీపాక్స్ వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు తేల్చారు.

అసహజ శృంగారం వల్ల ఈ కొత్త వ్యాధులు వ్యాపిస్తున్నాయని తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. ఈ ప్రపంచం ఎటుపోతుందని ఆవేదన చెందుతున్నారు. అసహజ తిండివల్లేనే కరోనా సోకింది. ఇప్పుడు అసహజ శృంగారంతో ఇది వ్యాపించడం అందరినీ కంగారుపెడుతోంది.
Tags:    

Similar News