రాబోయే ఐదురోజులు మునుగోడు హోరెత్తిపోనున్నది. నవంబర్ 3వ తేదీన అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ జరగుబోతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అన్నీపార్టీలు ప్రచారంతో హోరెత్తించాలని ప్లాన్ చేస్తున్నాయి. బహిరంగసభలు, రోడ్డుషోలు, ఇంటింటి ప్రచారాలతో అభ్యర్ధుల ప్రచార ఉధృతి పెరిగిపోనున్నది. చండూరు మండలకేంద్రంలో జరగబోయే బహిరంగసభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకాబోతున్నారు. అలాగే మరుసటిరోజు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగబోయే బహిరంగసభలో కేసీయార్ పాల్గొంటారు.
ఇక భారతజోడో యాత్ర స్పూర్తితో 27,28 తేదీల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు రోడ్డుషోలు, పాదయాత్రలు చేయబోతున్నారు. అవకాశముంటే నవంబర్ 1వ తేదీన శంషాబాద్ మండలంలో రాహుల్ గాంధి నేతృత్వంలో ఒక భారీ బహిరంగసభ నిర్వహణ అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.
మూడు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి చెందిన సీనియర్ నేతలంతా మునుగోడులోనే క్యాంపు వేసున్నారు. దీపావళి పండుగ సందర్భంగా రెండురోజులు అందరు కాస్త విరామం తీసుకున్నా మంగళవారం అందరు మునుగోడుకు చేరుకున్నారు.
మొత్తంమీద గెలుపునే అన్నీపార్టీలు అత్యంత ప్రతిష్టత్మాకంగా తీసుకోవటంతో ప్రచారహోరు పెరిగిపోతున్నది. ఇదేసమయంలో ముందెన్నడూ లేనివిధంగా డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు జరుగుతోంది. డబ్బుల ఖర్చులు, పంపిణీలో టీఆర్ఎస్, బీజేపీలు ఏమాత్రం వెనక్కుతగ్గటంలేదు.
దాంతో ఓటర్లకు పంపిణీ చేయబోతున్న డబ్బులను అచ్చంగా డబ్బుల రూపంలోనే కాకుండా ఇతరత్రా రూపాల్లో పంపిణీ జరిగిపోతోంది. మొన్నటి దీపావళి పండుగ సంరద్భంగా పై రెండుపార్టీలు పోటీలుపడి మరీ జనాల్లో చాలామందికి టపాకాయలు, స్వీట్లు పంపిణీచేశాయి.
వీళ్ళతో పోటీపడలేని కాంగ్రెస్ పార్టీ చోద్యం చూస్తున్నదంతే. అసలు డబ్బుల ఖర్చులో టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ముందు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి ఎందుకు పనికిరాకుండా పోతున్నారు. బీజేపీ ఓటుకు రు. 30 వేల పంచుతున్నదని టీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. ఇదే సమయంలో టీఆర్ఎస్ ఓటుకు రు. 40 వేలు ఇస్తున్నట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంమీద రాబోయే ఐదురోజుల్లో మునుగోడు హోరెత్తిపోవటం ఖాయం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.