కొన్నిరోజుల క్రితం కరోనా కొత్త స్ట్రెయిన్ చాలా బయపెట్టింది. బ్రిటన్‌లో మొదలైన ఈ స్ట్రెయిన్ క్రమంగా ఇతర దేశాలకు కూడా పాకింది. అయితే వ్యాక్సిన్ కొత్త స్ట్రెయిన్‌కు పనిచేస్తుందా? లేదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. మనదేశంలోనూ కొన్ని కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. అయితే కొత్త స్ట్రెయిన్ ప్రభావం ఇండియాలో పెద్దగా లేదనే చెప్పుకోవాలి. అయితే కరోనా మహమ్మారి మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో పోలేదు. వ్యాక్సిన్ వచ్చినా.. కేసుల తీవ్రత తగ్గినా కరోనా కేసులు ఇంకా చాలా చోట్ల భారీ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. అమెరికా, బ్రెజిల్ యూరప్ దేశాల్లో కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది.
అయితే కరోనా కొత్త స్ట్రెయిన్‌పై బ్రిటన్‌కు చెందని శాస్త్రవేత్తలు పలు సంచలన విషయాలు బయటపెట్టారు.
బ్రిటన్ కరోనా స్ట్రెయిన్ త్వరలో ప్రపంచమంతా వ్యాపించే అవకాశం ఉందని ఆ దేశ జీనోమిక్స్ డైరెక్టర్ షారన్ పీకాక్ హెచ్చరించారు. కొత్త స్ట్రెయిన్‌తో వ్యాక్సిన్ కూడా ప్రభావవంతంగా పనిచేయకపోవచ్చని ఆమె అన్నారు.
ప్రస్తుతం 1.1.7 మ్యుటేషన్ ఉందని ఆయన పేర్కొన్నారు.ఇది మరోసారి మ్యుటేట్ అవుతోందని చెప్పారు.
ఇటువంటి కొత్త స్ట్రెయిన్లను మరో పదేళ్లపాటు ఎదుర్కొక తప్పదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా రోజురోజుకూ తన రూపాన్ని అంటే జన్యు క్రమాన్ని మార్చుకుంటున్నది. ఈ క్రమంలో కొత్త స్ట్రెయిన్ ఏది పాత స్ట్రెయిన్ ఏది అన్న విషయం వైద్యులకే అంతు పట్టడం లేదు.