మండలి ఛైర్మన్‌గా మోషేన్‌రాజు బాధ్యతలు !

Update: 2021-11-19 10:31 GMT
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి నూతన ఛైర్మన్‌ గా మోసేను రాజు భాద్యతలు స్వీకరించారు. మోషేన్‌రాజును చైర్‌వద్దకు తీసుకొచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోషేన్‌రాజు నిబద్ధత గల రాజకీయ నాయకుడు అని సీఎం అన్నారు.

ఈ సందర్భంగా మోషేన్‌రాజుకు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. మండలి ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌ పదవుల్లో ఒకటి ఎస్సీకి, రెండోది బీసీ లేదా మైనారిటీ వర్గానికి ఇవ్వాలనే ప్రతిపాదనపై వైసీపీ అధిష్ఠానం చర్చించి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈయన కంటే ముందు ఎంఏ షరీఫ్‌ ఛైర్మన్‌ గా ఉన్నారు. అయన పదవీ విరమణ చేయడంతో శాసనమండలి ఛైర్మన్‌గా కొయ్యే మోషేన్‌రాజు బాధ్యతలు స్వీకరించారు.

1987 నుంచి వరుసగా నాలుగుసార్లు మునిసిపల్‌ కౌన్సిలర్‌గా, రెండుసార్లు ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. ఏపీసీసీ ఎస్సీ, ఎస్టీ సెల్‌ ప్రత్యేక ఆహ్వానితుడిగా, కాంగ్రెస్‌ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శిగా, యూత్‌ కాంగ్రెస్‌ భీమవరం పట్టణ అధ్యక్షుడిగా వివిధ పదవులు నిర్వహించారు.

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఆ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీకి మోషేన్‌ రాజు సేవలను గుర్తించిన సీఎం జగన్‌ గవర్నర్‌ కోటాలో ఆయనను ఎమ్మెల్సీ చేశారు.
Tags:    

Similar News