తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి.. కొద్ది రోజుల్లోనే కోటీశ్వరుల కావచ్చు.. ఎలాంటి కష్టం లేకుండా అధిక డబ్బు పొందవచ్చు.. లాంటి ప్రకటనలకు నిరక్ష్యరాస్యులు.. సమాజం మీద అవగాహన లేనివాళ్లు మోసపోవడం ఇదివరకు చూశాం.. కానీ ఇప్పుడు లక్షల్లో జీతాలు తీసుకునే టెకీలు మోసపోతున్నారు. అవగాహన ఉన్నా.. అతి తక్కువ సమయంలో అధిక డబ్బు సంపాదించాలన్న ఆశతో పెట్టుబడులు పెడుతూ లక్షల్లో నష్టపోతున్నారు.
అవగాహన ఉండి కూడా.. కొందరు ఇలాంటి మోసంలో ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా సైబారాబాద్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను చూస్తే ఎక్కువ శాతం టెకీలే ఉన్నారు.
మనకు తెలియకుండానే వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో మన ఫోన్ నెంబర్ యాడ్ అయిపోతుంది.. ఆ తరువాత కొందరు చిన్న పెట్టుబడి పెట్టండి చాలు.. కొన్ని రోజుల తరువాత లక్ష్లల్లో అర్జిస్తారు.. అని చెప్పి ఓ లింక్ ను పంపిస్తారు. ఈ ప్రకటనకు ఆకర్షితులైన కొందరు ఆ లింక్ ను ఓపెన్ చేస్తారు.
వారు అడిగిన డిటెయిల్స్ అన్నీ అచ్చేస్తారు. అయితే కొన్ని రోజుల తరువాత వారు లాగిన్ అయిన యాప్ లల్లో నగదు కనిపిస్తుంది.. దీంతో వాటిని డ్రా చేసుకుందామని అనుకునేలోపే అదీ సాధ్యం కాదని చెబుతారు.. మరికొంత సమయం ఆగాలని చెబుతారు. కానీ అ డబ్బు రాదు.. అలాగే ఉంటుంది.. దీనిని భరించని కొందరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో అసలు విషయం బయటపడింది.
ఇక మరికొందరు ఇంకో రకమైన మోసానికి పాల్పడుతున్నారు. కొన్ని సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన తరువాత కొన్ని రోజుల వరకు వడ్డీతో సహా తిరిగి ఇస్తారు. దీనిని చూసిన చాలా మంది ఎక్కువ మొత్తంలో పెట్టడానికి యత్నించారు.అలా లక్షల్లో సొమ్ము అప్పజెప్పిన తరువాత ఆ గ్రూప్ నుంచి పెట్టుబడి పెట్టిన వారిని రిమూవ్ చేస్తారు. ఆ తరువాత లబోదిబోమనడం యూజర్ వంతవుతుంది. అయితే చాలా మంది మల్టీనేషనల్ కంపెనీల్లో చేస్తున్నవాళ్లే బాధితులు ఉండడం గమనార్హం. స్మార్ట్ గా చీటింగ్ చేస్తున్న విషయం గ్రహించలేక చాలా మంది డబ్బును పోగొట్టుకొని పోలీసులను ఆశ్రయించారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ స్టిఫెన్ రవీంద్ర ఇలాంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు.సాధారణ నేరాలతో పోలిస్తే ఇలాంటి నేరాలు 200 శాతం ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు ఇవ్వొద్దని సూచిస్తున్నారు. అంతేకాకుండా మనకు తెలియకుండా గ్రూపుల్లో యాడ్ అయితే వెంటనే ఎగ్జిట్ అవడం బెటరని సూచిస్తున్నారు.