ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో దేశంలో ఏపీ సీఎంది ఎన్నో ర్యాంకు?

Update: 2021-05-07 03:37 GMT
మరో ఘనతను సొంతం చేసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశ వ్యాప్తంగా ప్రజామోదం కలిగిన ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాను తయారు చేసిందో మీడియా సంస్థ. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగులేని స్థానాన్ని కట్టబెట్టటం ఆసక్తికరంగా మారింది. దేశ వ్యాప్తంగా ఉత్తమ ప్రజామోద ముఖ్యమంత్రుల్లో ఆయనది రెండో స్థానంగా తేల్చింది.

ఓఆర్ మాక్స్ మీడియా సంస్థ ఈ జాబితాను సిద్ధం చేసింది. తాము ఎంపిక చేసిన జాబితాకు మూలం.. ప్రజల్లో ఆయా సీఎంలకు ఉన్న ఆదరణను ప్రాతిపదికగా తీసుకొని చేశామని వెల్లడించింది. జాతీయ స్థాయిలో రెండో ఉత్తమ ముఖ్యమంత్రిగా జగన్ చోటు దక్కించుకోగా.. మొదటి స్థానంలో ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. తాము రూపొందించిన ప్రమాణాలకు తగ్గట్లుగా.. స్కోరింగ్ ను లెక్క కట్టారు.

ఈ లెక్కన చూసినప్పుడు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు 57 స్కోర్ రాగా.. రెండో స్థానంలో నిలిచిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 55 మార్కులు లభించాయి. జాబితాలో మూడో స్థానంలో అసోం సీఎం నిలవగా.. నాలుగో స్థానంలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఇటీవల రెండోసారి అధికారంలోకి వచ్చిన పినరయి విజయన్ నిలిచారు. ఆయనకు 54 మార్కులు వచ్చాయి.

దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో సంక్షేమ పథకాల్ని భారీ ఎత్తున చేపడుతున్న ముఖ్యమంత్రిగా జగన్ నిలిచారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు కావొచ్చు.. కోవిడ్ సవాలు విసరొచ్చు.. ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనప్పటికి సంక్షేమ పథకాల్ని మాత్రం కచ్ఛితంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రుల్లోజగన్ నిలిచారు. అదే సమయంలో.. కోవిడ్ సెకండ్ వేవ్ ను కూడా ఆయన సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. ఆయనకు కేవలం 22 మార్కులకే పరిమితమయ్యారు.
Tags:    

Similar News