మావోల‌కు భారీ షాక్‌: జ‌ంప‌న్న లొంగుబాటు

Update: 2017-12-25 10:05 GMT
మావోల‌కు భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్యుడు జంప‌న్న‌.. ఆయ‌న స‌తీమ‌ణి ర‌జిత తెలంగాణ ప్ర‌భుత్వం ఎదుట లొంగిపోయారు. త‌మ లొంగుబాటు వెనుక ఎవ‌రి ఒత్తిడి లేద‌ని స్ప‌ష్టం చేసిన జంప‌న్న‌.. సైద్ధాంతిక విభేదాల వ‌ల్లే తాను లొంగిపోయిన‌ట్లు పేర్కొన్నారు.

పోలీసుల‌కు లొంగిపోయిన మావోయిస్టు జంప‌న‌న్న‌ను తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి మీడియా ఎదుట హాజ‌రు ప‌రిచారు. జంప‌న్న‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణిని కూడా మీడియా ముందుకు తీసుకొచ్చారు. మావోల‌తో త‌మ‌కున్న సైద్ధాంతిక విభేదాల‌తోనే తాము బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు. ఉద్య‌మంలో ఉన్న‌ప్పుడు మావో పార్టీ లైన్ ప్ర‌కారం నిజాయితీగా.. నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేసిన‌ట్లు పేర్కొన్నారు.

పీపుల్స్ వార్‌.. మావోయిస్టుల లైన్ అప్ప‌టి ప‌రిస్థితుల్లో స‌రైన‌దేన‌న్నారు. గ‌డిచిన 15 ఏళ్ల‌లో దేశంలో అనేక సామాజిక మార్పులు చోటు చేసుకున్నాయ‌న్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అర్థ భూస్వామ్య ప‌ద్ద‌తి స‌రికాద‌న్న ఆయ‌న‌.. ఇప్పుడు భూస్వాములు.. భూస్వామ్య వ్య‌వ‌స్త కూడా లేద‌న్నారు.

కాలంతో పాటు మావోయిస్టు పార్టీ మార‌లేక‌పోయింద‌ని.. ప్ర‌జ‌ల‌తో క‌లిసి ప‌ని చేయ‌టానికి అనే స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోంద‌న్నారు. త‌న‌కున్న అభిప్రాయాల్ని క‌మిటీతో నిర్ధిష్టంగా చ‌ర్చించ‌లేక‌పోయాన‌ని.. అందుకే కేంద్ర క‌మిటీకి లేఖ రాసి తాను బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు చెప్పారు. త‌న ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లు పార్టీని మార్చ‌టం సాధ్యం కాద‌ని తెలుసుకున్న తాను సాధార‌ణ జీవితాన్ని గ‌డ‌పటానికి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన‌ట్లుగా చెప్పారు.

ఇంత‌కీ జంప‌న్న ఎవ‌రు? ఆయ‌న బ్యాక్ గ్రౌండ్ ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే.. జంప‌న్న అస‌లు పేరు జినుగు న‌ర‌సింహారెడ్డి కాగా.. ఆయ‌న‌ది మ‌హబూబ్ న‌గ‌ర్ జిల్లా తొర్రూర్ మండ‌లం చ‌ర్ల‌పాలెం స్వ‌స్థ‌ల‌మ‌ని.. 1984లో మ‌ల్లేప‌ల్లిలో ఐటీఐ చ‌దివేట‌ప్పుడు మావో సిద్ధాంతాల‌కు ఆక‌ర్షితుడై తాను అందులోకి వెళ్లిన‌ట్లు చెప్పారు.

33 ఏళ్ల పాటు పార్టీలో ప‌ని చేసిన తాను అంచెలంచెలుగా ఎదిగిన‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం కేంద్ర‌క‌మిటీ స‌భ్యుడిగా తాను ప‌ని చేస్తున్న‌ట్లు చెప్పిన జంప‌న్న‌.. త‌న‌పై 100 కేసులు ఉన్నాయ‌న్నారు. తెలంగాణ‌లో 51 కేసుల ఉన్న‌ట్లు చెప్పారు. ఇక‌.. జంప‌న్న స‌తీమ‌ణి ర‌జిత స్వ‌స్థ‌లం వ‌రంగ‌ల్ జిల్లా వాసి. 2009లో వీరిద్ద‌రూ పెళ్లి చేసుఉన్నారు. జంప‌న్న‌పై రూ.25 ల‌క్ష‌ల రివార్డు.. ర‌జిత మీద రూ.5ల‌క్ష‌లు రివార్డు ఉంది. తాజాగా పోలీసుల ఎదుట వారికి వారే లొంగిపోవ‌టంతో వారిపై ఉన్న రివార్డును వారికే అందిస్తామ‌ని డీజీపీ చెప్పారు. అంద‌రిలా ప్ర‌జాజీవ‌నంలో జీవించేందుకు వీలుగా వారికి అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాల్ని తాము అందిస్తామ‌ని డీజీపీ వెల్ల‌డించారు.
Tags:    

Similar News