ప్రపంచంలో ఏ కొడుకు అనుభవించలేని ఓ నరకం.. ఏ తల్లికి రాకూడని ఓ కష్టం ఇది. కన్నతల్లి వ్యభిచారం కూపంలో కూరుకుపోయింది. తల్లిని ఎలాగైనా ఆ నరకం నుంచి విడిపించాలనుకున్నాడు కొడుకు. ఇందుకోసం ఎంతో ప్రయత్నించాడు. చివరకు తన తల్లికి విముక్తి కల్పించాడు. ఫైనల్గా ఆ తల్లి కొడుకు వద్దకు చేరుకున్నది. మాటలకందని ఈ విషాద ఘటన పూణేలో జరిగింది.
కోల్కతాకు చెందిన ఓ మహిళ అదే పట్టణంలో ఇంటి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. అయితే ఆమెకు ఓ వ్యక్తి పరిచమయ్యాడు. మంచి ఉద్యోగం ఇప్పిస్తానంటూ పూణేకు తీసుకెళ్లి .. బలవంతంగా బుధ్వార్పేట్లోని రెడ్ లైట్ ఏరియాలోని ఓ వ్యభిచార ముఠాకు అప్పగించాడు. 2019లో ఆమె వ్యభిచార కూపంలో కూరుకుపోయింది. దీంతో ఆమె కుమారుడు తన తల్లి కోసం అనేక ప్రాంతాలు తిరిగాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు.
అయితే చివరకు సదరు మహిళకు తెలిసిన వ్యక్తి బ్రోతల్ హౌస్కు వెళ్లాడు. దీంతో ఆమె అతడి ఫోన్ నుంచి తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ తర్వాత బ్రోతల్ హౌజ్ కు వెళ్లి వచ్చిన వ్యక్తి కుటుంబసభ్యులకు అడ్రస్ చెప్పాడు.
దీంతో ఆమె కుమారుడు గౌరవ్ పూణే సిటీ పోలీసులకు విషయం చెప్పాడు. చివరకు 2020 సెప్టెంబర్ 18న పోలీసులు సదరు బ్రోతల్ హౌస్లో తనిఖీలు జరిపి ఆ మహిళలను కాపాడారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నవారిపై మొత్తం నాలుగు రేప్ కేసులు నమోదయ్యాయి.
ఆ తర్వాత గౌరవ్ తల్లిని పూణేలోని గవర్నమెంట్ అబ్జర్వేషన్ హోంలో ఉంచారు. చివరకు అన్ని ప్రాసెస్లు పూర్తి చేసుకొని మార్చి 2న సదరు మహిళ తన కుమారుడి వద్దకు చేరుకున్నది.
‘ ఇటువంటి కష్టం లోకంలో మరెవరికి రాకూడదు. ఇటువంటి ముఠాలపై పోలీసులు, ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. నా లాంటి అమాయకులు చాలా మంది వ్యభిచార కూపాల్లో కూరుకుపోతున్నారు. కొంతమంది తప్పనిసరై.. మరికొంత మంది అనుకోకుండా ఇటువంటి ముఠాల్లో చేరిపోతున్నారు’ అంటూ ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకున్నది.