టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీకి చెందిన దళిత నేత మోత్కుపల్లి నర్సింహులు విరుచుకుపడ్డారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడు అనంతరం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ మోత్కుపల్లి సంచలన కామెంట్లు చేశారు. తనను టీడీపీ నుంచి గెంటేసే కుట్ర జరుగుతుందని మోత్కుపల్లి నర్సింహులు కలకలం రేపే అంశాలను మీడియాకు వెల్లడించారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం నిజాయితీగా పని చేస్తున్నానని పేర్కొన్న మోత్కుపల్లి అలాంటి తనకు కనీసం 5 నిమిషాలు మాట్లాడేందుకు చంద్రబాబు సమయం ఇవ్వలేదని ఆరోపించారు. తాను చేసిన తప్పేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను చేసిన తప్పు చెప్పే వరకు ఇలానే మాట్లాడుతూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కోసం నిజాయితీగా పని చేయడమే తప్పా? చంద్రబాబును నమ్మి సర్వం కోల్పోయాను అని ఆవేదన చెందారు.
రేవంత్‌రెడ్డికి అడ్డంగా మాట్లాడినందుకే తనను అవమానాల పాలు చేస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. `రేవంత్ రెడ్డిని చంద్రబాబు నమ్మారు.. ఏమైంది? ఓ పనికిమాలిన వ్యక్తిని నమ్మి పార్టీని నాశనం చేశారు. తెలంగాణలో టీడీపీ మొత్తం ఖాళీ అవుతుంది`అని మోత్కుపల్లి పేర్కొన్నారు. ``రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖుల వల్ల పార్టీ తెలంగాణలో నాశనమైంది. రమణను సైలెంట్ చేసి సీఎంగా నిన్న గాక మొన్న వచ్చిన రేవంత్‌ను ఫోకస్ చేశారు. మీ పేరు బొమ్మ లేకుండా ప్రోగ్రాం చేసినా చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఓటుకు కోట్లులో రెడ్ హ్యాండెడ్ గా మనం తయారు చేసిన నాయకుడు దొరికితే చర్యలు ఎందుకు తీసుకోలేదు? చర్యలు తీసుకుంటే మాట్లాడితే రేవంత్ రెడ్డి అప్రూవర్ గా మారుతా అని బెదిరిస్తున్నాడని భయపడుతున్నారట నిజమేనా`` అంటూ మోత్కుపల్లి సంచన విషయాలు వెల్లడించారు.
తాను చేసిన తప్పేంటో చెప్పాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. తాను చేసిన తప్పు చెప్పే వరకు ఇలానే మాట్లాడుతూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. `పార్టీ కోసం నిజాయితీగా పని చేయడమే తప్పా? చంద్రబాబును నమ్మి సర్వం కోల్పోయాను.పార్టీ కోసం పని చేసి ఒంట్లో షుగర్ కూడా ఎక్కువైంది. చంద్రబాబు కోసం దెబ్బలు తిన్నాను. ఆయనను నమ్మాను. నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాను. రేవంత్‌రెడ్డి కూతురు పెళ్లిని చంద్రబాబు దగ్గరుండి చేయించారు. కానీ నా బిడ్డ పెల్లికి ఎప్పుడో నాలుగు గంటలకు వచ్చారు.దళితుడిని కాబట్టే అవమాన పరుస్తున్నారని పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన నాయకులను ఆకాశానికి ఎత్తుతున్నారు`` అని మోత్కుపల్లి ఆవేదన చెందారు.
ఈ సందర్భంగా తన గవర్నర్ గిరి గురించి కూడా మోత్కుపల్లి వెల్లడించారు. `ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం నడుస్తుందని.. తనకు గవర్నర్ పదవి రాకుండా ఆపింది నిజం కాదా?` అని మోత్కుపల్లి బాబును ప్రశ్నించారు. ``ఇది కుట్ర కాదా? నాకు ఇవ్వాల్సిన ఎంపీ పదవిని.. గరికపాటి, టీజీ వెంకటేష్ కు ఇవ్వలేదా?` అని నిలదీశారు. పిచ్చుకపై బ్రహ్మస్త్రంగా నాపై ఎందుకు ఇంత పగ పట్టారని బాబుని నిలదీశారు. ఇప్పటికైనా తనను చర్చలకు పిలవాలని లేదంటే ఆంధ్రకు వచ్చి ఊరూరూ తిరిగి ఏం తప్పు చేశానో చెబుతా అన్నారు. ``నేను మీటింగ్ పెట్టినా 10వేల మంది వస్తారు. అలాంటిది మహానాడుకి ఎందుకు అంత తక్కువ మంది వచ్చారో ఆత్మవిమర్శ చేసుకోవాలి`` అని మోత్కుపల్లి అన్నారు. ``సీఎం కేసీఆర్ నాకు మంచి మిత్రుడు అని.. ప్రత్యేకంగా పొగడాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. ``15 సంవత్సరాల దోస్తాన చేసిన కేసీఆర్‌కు నాబిడ్డ పెళ్లి ఉంది అని చెప్పగానే ఆత్మీయంగా స్వాగతం పాలకడమే కాదు పెళ్లి కూడా వచ్చారు. కానీ చంద్రబాబు ఎంతో ఎదిరిచూసిన తర్వాత వచ్చారు. కేసీఆర్ ఎప్పుడో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేసి పార్లమెంటుకు పంపారు. మరి మీరు ఎందుకు అలా చేయడం లేదు. అయ్యా చంద్రబాబు గారు ఆంధ్రాలో కూడా దళితులు ఉన్నారు జాగ్రత్త.`` అని ప్రశ్నించారు. పార్టీ నుంచి గెంటేయటానికి టీడీపీలో కుట్ర జరుగుతుంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు.