ఏపీ మాజీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటే...విమర్శలు గుప్పించే టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నరసింహులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికై - మంత్రిగా పని చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఇటీవల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. ఇలా పొలిటికల్ కెరీర్ అయోమయంలో పడిన మోత్కుపల్లి నరసింహులు త్వరలో బీజేపీలోకి చేరనున్నారని సమాచారం.
రాజ్యసభ - గవర్నర్ పదవుల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనను మోసం చేశాడని ఆయనపై తిరుగుబాటు జెండాను ఎగురవేసిన మోత్కుపల్లి సస్పెన్షన్ కు గురైన విషయం తెలిసిందే. అనంతరం చంద్రబాబు ఓటమే లక్ష్యంగా పనిచేశారు. చంద్రబాబు ఓడితేనే..ఎన్టీఆర్ ఆత్మకు శాంతి చేకూరుతుందని వ్యాఖ్యానించారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు మద్దతుగా బహిరంగంగా ప్రకటనలు చేశారు. అదే సమయంలో ఆలేరు అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేయగా ఓటమి పాలయ్యారు. ఇలా రాజకీయంగా ఒకింత అస్పష్టతతో ఉన్న సమయంలో....బీజేపీలోకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు.
మోత్కుపల్లి నరసింహులుకు కాషాయ కండువా కప్పడంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి - బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆయన ఇంటికి వెళ్లారు. మోత్కుపల్లిని బీజేపీలోకి ఆహ్వానించడంపై రెండు గంటల పాటు కిషన్ రెడ్డి - లక్ష్మణ్ సుదీర్ఘ చర్చలు జరిపారు. సానుకూలంగా స్పందించిన మోత్కుపల్లి... బీజేపీలో చేరేందుకు సిద్ధపడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు - కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆయన పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.