సుదీర్ఘ కాలం పార్టీలో ఉన్న నేత విభేదాలు వచ్చి పార్టీ నుంచి వీడిపోతే.. సదరు అధినేతకు ఎంత కష్టమో మాటల్లో చెప్పాల్సిన అవసరమే ఉండదు. తాజాగా అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి కమ్ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు. పార్టీలో సుదీర్ఘకాలం ఉన్న తెలంగాణ తెలుగు తమ్ముడు మోత్కుపల్లి ఈ మధ్యనే పార్టీ నుంచి బహిష్కృతుడు కావటం తెలిసిందే. తనపై వేటు వేయటంపై ఆయన ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
పార్టీని వీడే సమయంలో చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసి సంచలన సృష్టించిన మోత్కుపల్లి తాజాగా మరోసారి విమర్శనాస్త్రాల్ని సంధించారు. దళితుల ఓట్లు దండుకునేందుకు చంద్రబాబు దళిత తేజం కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా చెప్పారు. మాలలు.. మాదిగల్ని చంద్రబాబు మోసం చేశారని.. ఆయన్ను ఇకపై నమ్మరన్నారు. ఓట్లు అడిగే ముందు.. దళితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని.. ఆ తర్వాతే ఓట్లు అడగాలన్నారు.
తెలుగుదేశం పార్టీలో ఉన్నంత కాలం తనను మానసికంగా చంపేశారన్న మోత్కుపల్లి.. తాను జులై 11న తిరుమలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా స్వామి వారిని తానేం కోరుకుంటానో వెల్లడించారు. ఏపీలో చంద్రబాబు ఓటమిని తాను కోరుకుంటానని.. స్వామి వారిని ఆ విధంగా మొక్కుకుంటానన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే తాను ఎన్నికల బరిలో నిలుస్తానన్న మోత్కుపల్లి మాటలు విన్నప్పుడు. .ఆయన్ను అంతలా హర్ట్ చేసేలా బాబేం చేశారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
బాబుపై మోత్కుపల్లి చేసిన మరిన్ని కీలక వ్యాఖ్యలు..
+ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని ఏపీ సీఎం చంద్రబాబు సర్వనాశనాలకు నిలయంగా మార్చారు. తక్కువ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని అని మాట్లాడుతూ అంబేడ్కర్ ఆలోచనా విధానాలను చంద్రబాబు అణగదొక్కుతున్నారు. దళిత తేజం పేరుతో దళితుల ఓట్ల కోసం గ్రామాల్లో తిరుగుతున్నారని - దళితులను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు.
+ నా ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ముద్దు కృష్ణమనాయుడిని.. తనను ముఖ్యమంత్రి అయ్యే వరకు చంద్రబాబు వాడుకున్నారు. సీఎం అయ్యాక గాలికొదిలేశారు.
+ నేనేంటో చంద్రబాబుకు తెలుసు. దారినపోయే దానయ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబుకు గుణపాఠం చెప్పాల్సిన ఏ అవకాశాన్ని వదులుకోవద్దని కోరుతున్నాను. చంద్రబాబు ముఖం చూసి ఓటేసిన వాళ్లు లేరు.
+ సీఎం రమేష్ లా దీక్ష చేస్తే ఏడాదిపాటు చేయొచ్చు. 11 రోజులైనా అలసిపోకుండా సీఎం రమేష్ దీక్ష చేస్తున్నాడు. దొంగ దీక్ష చేస్తున్నాడు కాబట్టే.. టీడీపీ ఎంపీలు చులకనగా మాట్లాడారు. ఉక్కు రాదు.. తుక్కు రాదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కరెక్ట్ గా మాట్లాడారు.
+ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు ఘోరీ కట్టడం ఖాయం. చంద్రబాబు మోసగాళ్లకే మోసగాడు. చంద్రబాబు ఓడిపోతే నాకు అన్ని పదవులు వచ్చినట్లే. చంద్రబాబుకు తప్పకుండా దళితుల ఉసురు తగులుతుంది.
+ ఏనాడు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని అడగలేదు. హోదా కావాలని అడిగే నైతికహక్కు చంద్రబాబు కోల్పోయారు. హోదా కోసం పోరాడుతుంది వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు - ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - వామపక్షాలు.
+ నా 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబులాంటి నీచ రాజకీయ నేతలను చూడలేదు. చంద్రబాబు లాంటి నీచుడు రాజకీయాల్లో ఉండొద్దని దివంగత నేత ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు. టీడీపీలో చంద్రబాబు కంటే నేనే సీనియర్. చంద్రబాబు హృదయం లేదని బండరాయి. నేను ఏడిస్తే ఒక్కసారైనా వచ్చి ఓదార్చారా.. ? నన్ను విజయసాయిరెడ్డి సహా అన్ని పార్టీల వాళ్లు ఓదార్చారు. చంద్రబాబుకు ధైర్యముంటే కేసులన్నింటినీ రీ ఓపెన్ చేసుకోవాలి. చంద్రబాబు దొరకని దొంగ.
+ చంద్రబాబుకు మతిమరుపు - పిచ్చి రోగం వచ్చింది. సీఎంగా ఉండే అర్హత ఆయనకు లేదు. చంద్రబాబును ఓడించాలని ఎన్టీఆర్‌గారి కోరికతో పాటు నా కోరిక కూడా. గుమ్మి కింద పందికొక్కుల్లాగా రాష్ట్రాన్ని తండ్రీకొడుకులు దోచుకుతింటున్నారు.
+ పార్టీ నుంచి నన్ను బహిష్కరించే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారు. చంద్రబాబును వదిలిపెట్టేది లేదు. నువ్వు, నీ కొడుకూ తప్ప రాష్ట్రంలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా? గతంలో తెలంగాణ ప్రజలు చంద్రబాబును తన్ని తరిమేశారు. ఇప్పుడు ఏపీ ప్రజలు తన్ని తరియేయడానికి సిద్ధంగా ఉన్నారు.