హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో పాదచారులు రోడ్డు దాటాలంటే చాలా కష్టం. ముఖ్యంగా మహిళలు నగరాల్లోని ప్రధాన కూడళ్లలోని రోడ్డు దాటాలంటే పద్మవ్యూహాన్ని చేధించినట్లుగా శ్రమించాల్సి వస్తుంది. దాదాపు అన్ని మెట్రో నగరాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. చూడటానికి ఇది చిన్న సమస్యలా కన్పించినా ఆదమరిస్తే మాత్రం పెద్ద మూల్యం చెల్లించుకోక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రోడ్డుపై వాహనాలు వెళ్లేందుకు ఎంత హక్కు ఉందో.. అంతే హక్కు పాదచారులకు కూడా ఉంది. అయితే ఈ విషయాన్ని వాహనదారులు క్రమంగా మరిచిపోతున్నట్లు కన్పిస్తోంది. పాదాచారులకు కోసం నగరాల్లో ప్రత్యేకంగా ఫుట్ పాత్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వాలు గొప్పగా చెబుతున్నా ఆచరణలో మాత్రం ఎక్కడా కన్పించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫుట్ పాతలన్నీ కబ్జాలు అవుతుండటం.. చిన్న వ్యాపారాలన్నింటికీ కూడా ఫుట్ పాత్ లే కేంద్రాలుగా మారుతుండటంతో ట్రాఫిక్ సమస్య కత్తి మీద సాములా మారుతోంది. సరిగా పని చేయని సూచికలు... వేగంగా దూసుకొచ్చే వాహనాలను తప్పించుకునే ప్రయత్నంలో ఎంతోమంది ప్రాణాలను కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది.
హెల్మెట్ ధరించకుండా ఎంతో మంది వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారని ట్రాఫిక్ పోలీసులు చెబుతుంటారు. అయితే అదేస్థాయిలో రోడ్డును దాటుతూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా ఎవరూ పట్టించుకోక పోవడం శోచనీయంగా మారుతోంది. ఇలాంటి సమయంలో ఒక వీడియో అందరికీ కనువిప్పు కలిగించేలా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఇద్దరు మహిళలు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతుంటారు. ఒక మహిళ చేతిలో చిన్నారి కూడా ఉంది. ఈ పాదచారులు రోడ్డును దాటేందుకు యత్నిస్తుండగా వేగంగా వాహనాలు అటువైపు దూసుకొస్తూ ఉంటాయి. దీంతో వారు రోడ్డు దాటేందుకు నానా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమయంలోనే ఓ మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి వారిని రోడ్డును దాటేందుకు ప్రయత్నిస్తాడు.
ఎట్టకేలకు వారిని రోడ్డును దాటించడంతో మహిళలు హమ్మయ్యా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. ఈ సంఘటన చూస్తుంటే మన వాహనదారులు..ప్రభుత్వాల చర్యల కంటే కూడా ఓ మతిస్థిమితం లేని వ్యక్తి ఎంతో మేలనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. దీనిపై మీ రియాక్షన్ ఏంటో కింద తెలియజేయండి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View
Full View Full View
రోడ్డుపై వాహనాలు వెళ్లేందుకు ఎంత హక్కు ఉందో.. అంతే హక్కు పాదచారులకు కూడా ఉంది. అయితే ఈ విషయాన్ని వాహనదారులు క్రమంగా మరిచిపోతున్నట్లు కన్పిస్తోంది. పాదాచారులకు కోసం నగరాల్లో ప్రత్యేకంగా ఫుట్ పాత్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వాలు గొప్పగా చెబుతున్నా ఆచరణలో మాత్రం ఎక్కడా కన్పించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫుట్ పాతలన్నీ కబ్జాలు అవుతుండటం.. చిన్న వ్యాపారాలన్నింటికీ కూడా ఫుట్ పాత్ లే కేంద్రాలుగా మారుతుండటంతో ట్రాఫిక్ సమస్య కత్తి మీద సాములా మారుతోంది. సరిగా పని చేయని సూచికలు... వేగంగా దూసుకొచ్చే వాహనాలను తప్పించుకునే ప్రయత్నంలో ఎంతోమంది ప్రాణాలను కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది.
హెల్మెట్ ధరించకుండా ఎంతో మంది వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారని ట్రాఫిక్ పోలీసులు చెబుతుంటారు. అయితే అదేస్థాయిలో రోడ్డును దాటుతూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా ఎవరూ పట్టించుకోక పోవడం శోచనీయంగా మారుతోంది. ఇలాంటి సమయంలో ఒక వీడియో అందరికీ కనువిప్పు కలిగించేలా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఇద్దరు మహిళలు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతుంటారు. ఒక మహిళ చేతిలో చిన్నారి కూడా ఉంది. ఈ పాదచారులు రోడ్డును దాటేందుకు యత్నిస్తుండగా వేగంగా వాహనాలు అటువైపు దూసుకొస్తూ ఉంటాయి. దీంతో వారు రోడ్డు దాటేందుకు నానా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమయంలోనే ఓ మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి వారిని రోడ్డును దాటేందుకు ప్రయత్నిస్తాడు.
ఎట్టకేలకు వారిని రోడ్డును దాటించడంతో మహిళలు హమ్మయ్యా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. ఈ సంఘటన చూస్తుంటే మన వాహనదారులు..ప్రభుత్వాల చర్యల కంటే కూడా ఓ మతిస్థిమితం లేని వ్యక్తి ఎంతో మేలనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. దీనిపై మీ రియాక్షన్ ఏంటో కింద తెలియజేయండి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.