అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంది. నవంబర్ 3న జరిగే ఈ ఎన్నిక కోసం ప్రజలంతా సమాయత్తమవుతున్నారు. డెమోక్రటిక్, రిపబ్లిక్ పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు హాలీవుడ్ సెలెబ్రెటీలు ఓటర్లకు ‘నగ్న సందేశం’ ఇస్తున్నారు.
అమెరికా ఎన్నికల వేడి రాజుకోవడంతో ఆ వేడిని తట్టుకోలేక హాలీవుడ్ సెలెబ్రెటీలు దుస్తులు విప్పేస్తున్నారు. ఓ వీడియోతో ఓటర్లకు తమ ‘నగ్న సందేశం’ వినిపిస్తున్నారు.ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాళ్లు ఇలా నగ్నంగా కనిపించడానికి కారణం ఉంది.
అమెరికాలో 25శాతం ప్రజలు మెయిల్ ద్వారానే ఓటు వేస్తారు. పోలింగ్ స్టేషన్లకు వెళ్లకుండా కవర్లలో తమ ఓటును మెయిల్ చేస్తారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి 80శాతం మంది మెయిల్ ద్వారా పోలింగ్ లో పాల్గొంటున్నారు.ఈ నేపథ్యంలో పెన్సెల్వేనియా సుప్రీం కోర్టు ఇటీవల స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మెయిల్ ద్వారా ఓటు వేసే వారు రెండు ఎన్వలప్ కవర్లలో తమ ఓటును భద్రపరచాలని.. బ్యాలట్ పేపర్ ను ముందుగా ఒక సీక్రసీ కవర్లో పెట్టాలని.. సీల్ చేసి పోస్ట్ చేయాలని సూచించారు. తమ బ్యాలట్ ను సీక్రసీ కవర్లో పెట్టుకుండా కేవలం ఎన్వలప్ లో మాత్రమే పెట్టి పోస్ట్ చేస్తే దాన్ని ‘నేకెడ్ బ్యాలెట్’గా పరిగణిస్తారు. దీంతో ఆ ఓటు చెల్లదు.
ఈ క్రమంలోనే ప్రజలకు అవగాహన కల్పించేందుకు హాలీవుడ్ సినీ తారలు నడుంబిగించారు. వారంతా నగ్న వీడియోలను వదిలారు. దుస్తులేవి ధరించకుండా ‘నేకేడ్ బ్యాలెట్’ అంటే ఎమిటో వివరించారు. తాజాగా ప్రముఖ హాలీవుడ్ దిగ్గజాలు టాప్ లెస్ గా కనిపించి షాకిచ్చారు. మీ ఓటు వేస్ట్ కాకుండా ఉండాలని రెండు కవర్లలో బ్యాలెట్ ఉండేలా జాగ్రత్త పడాలని ఈ వీడియోలో సూచించారు. ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Full View