తెలంగాణాకు కావాల్సింది రామరాజ్యమేనట

Update: 2021-02-11 16:30 GMT
తెలంగాణాకు రాజన్న రాజ్యం అవసరం లేదని ఇపుడు కావాల్సింది రామరాజ్యం మాత్రమే అని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ కామెంట్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైస్సార్ కూతురు షర్మిల తెలంగాణా రాజకీయాల్లో అరంగేట్రం చేయటంపై ధర్మపురి స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతు తెలంగాణాలో రాజన్న రాజ్యం అవసరం లేదన్నారు.

మొన్నటి 9వ తేదీన లోటస్ పాండ్ లోని తన నివాసంలో వైఎస్సార్ మద్దతుదారులు, అభిమానులతో షర్మిల మొదటి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కు తెలంగాణా వ్యాప్తంగా గట్టి మద్దతుదారులు, అభిమానులున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయకపోయినా, తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జరిగిన మొదటి ఎన్నికలైనా సరే వైసీపీ తరపున ఖమ్మం ఎంపి+ముగ్గురు ఎంఎల్ఏలు గెలిచిన విషయం తెలిసిందే.

షర్మిల పొలిటికల్ ఎంట్రీపై రాజకీయపార్టీల్లో మిశ్రమస్పందన కనిపిస్తున్నది. అయితే అధికారపార్టీతో సహా బీజేపీ+కాంగ్రెస్ నేతలు మాత్రం షర్మిల ఎంట్రీపై నెగిటివ్ కామెంట్లే చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ధర్మపురి మాత్రం షర్మిలపై ఎటువంటి నెగిటివ్ కామెంట్లు చేయకపోయినా రాజన్న రాజ్యం అవసరం లేదని చెప్పటం గమనార్హం. ఒకవైపు రాజన్న రాజ్యం అవసరం లేదని చెబుతునే మరోవైపు తెలంగాణా రాజకీయాల్లో పొలిటికల్ ఎంట్రీ విషయంలో షర్మిలకు గుడ్ లక్ చెప్పటం విశేషమే.
Tags:    

Similar News