ఆగస్టు 15 న దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలు ఆదివారం దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కొందరు నేతలు కనీసం జాతీయ గీతం పాడలేక చతికిలబడుతున్నారు. పదాలు మరిచిపోయి దిక్కులు చూస్తున్నారు. తాజాగా ఓ లోక్‌సభ సభ్యుడు జాతీయ గీతం 'జనగణమన' మరచిపోయారు. జెండా ఎగురవేసిన అనంతరం జాతీయ గీతం ఆళపిస్తుండగా ఎంపీ నోరు తిరగలేదు. ఆయనతో పాటు ఆయన అనుచరులు, కార్యకర్తలు కూడా జాతీయ గీతం పాడలేక అవస్థలు ఎదుర్కొన్నారు. కొందరు జాతీయగీతం మరచిపోయి మధ్యలోనే ఆపివేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బీజేపీ నేత సాంబిత్ పాత్రా తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఎంపీ హసన్ తో బాటు ఆయన పార్టీ నేతలు, మద్దతుదారులు కూడా ఈ గీతాన్ని పాడలేకపోయారని, మన నేతల పరిస్థితి ఇలా ఉందని పాత్రా ఎద్దేవా చేశారు. చివరకు 'జయహే' అంటూ ముగించారన్నారు. అయితే గత ఫిబ్రవరి 1 న బెంగాల్ లోని హౌరాలో జరిగిన బీజేపీ ర్యాలీలో ఈ పార్టీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్ కూడా జాతీయ గీతాన్ని సరిగా పాడలేక పోయారంటూ అప్పట్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ విమర్శించారు. ఈ గీతంలో ఓ లైనును ఆయన విస్మరించారన్నారు. మరి బీజేపీ నేతలు మాత్రం తక్కువ తిన్నారా అంటూ సోషల్ మీడియా వేదికగా బీజేపీ నేతలపై సెటైర్లు పడిపోతున్నాయి.
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఎస్ టీ హసన్ ఉత్తరప్రదేశ్ మొరదాబాద్ లోని గుల్ షాహీద్ పార్క్ సమీపంలో స్వాతంత్య్ర వేడుకలకు హాజరయ్యారు. జెండా ఎగురవేసిన అనంతరం ఎంపీ హసన్ తో పాటు ఆయన కార్యకర్తలు జనగణమన ప్రారంభించారు. వారు జాతీయ గీతాన్ని, పాడుతూ మధ్యలో మరచిపోయి ఇష్టమొచ్చినట్టు పాడారు. చివరకు జయ జయహే అనేది పూర్తిగా అనకుండానే ముగించారు. ఈ గీతం ఆళపిస్తుండగా ఎంపీ హసన్ బిత్తిరిచూపులు చూస్తుండడం వైరల్‌గా మారింది. ఈ సంఘటన రాజకీయ దుమారం రేపింది. ఎంపీ, ఆయన కార్యకర్తలు జాతీయ గీతాన్ని పాడలేకపోయారు. మన నేతల పరిస్థితి ఇలా ఉంది అని బీజేపీ సీనియర్ నాయకుడు సంబిత్ పాత్ర ట్వీట్ చేస్తూ ఎద్దేవా చేశారు.