షాకింగ్ వ్యాఖ్యలు చేశారు బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ సోయం బాపూరావు. ఆయన మాటలు విన్నంతనే కొంతకాలం క్రితం హైదరాబాద్ లో జరిగిన ఒక సమావేశంలో మంత్రి కేటీఆర్ తన ప్రసంగంలో భాగంగా ఏపీ రోడ్ల గురించి చేసిన కామెంట్లు గుర్తుకు రాక మానవు. ఏపీ రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయన్న సోయం. 80కిలోమీటర్ల దూరానికి మూడున్నర గంటల ప్రయాణమా? అంటూ ఆశ్చర్యానికి గురయ్యారు.
తమ రాష్ట్రమే వెనుకబడిందని తాను అనుకుంటానని.. కానీ ఏపీలో మరింత అధ్వాన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఏపీలోని పరిస్థితుల పై అదిలాబాద్ బీజేపీ ఎంపీ విస్మయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. ఇంతకూ సోయం బాపూరావు ఏపీకి ఎందుకు వచ్చారు? ఎక్కడకువెళ్లారు? ఎందుకు వెళ్లారు? లాంటి ప్రశ్నలు మదిలో మెదలక మానదు. ఈ మధ్యనే ఏర్పాటు చేసిన కొత్త జిల్లా అయినా అల్లూరి సీతారామారాజు జిల్లా కేంద్ర మైన పాడేరులో ఆదివారం జనజాతి సురక్ష మంచ్ కు చెందిన వారు ర్యాలీ నిర్వహించారు.
ఇందులో పాల్గొనేందుకు పాడేరు వచ్చిన సోయం బాపూరావు స్థానిక మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీలోని రోడ్ల పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయని.. పాడేరు వాసులు విశాఖకు ఎలా వెళుతున్నారో తనకు అర్థం కాలేదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా జిల్లా కేంద్రాలు డెవలప్ కాకపోవటం దారుణమన్న ఆవేదనను వ్యక్తం చేశారు.
ఇప్పటికి కొన్ని గిరి గ్రామాల్లో ఒక్కరు కూడా చదువుకున్న వారు లేని పరిస్థితులు ఉండటంపై ఆశ్చర్యాన్నివ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ చేసి డెవలప్ చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఏపీ రోడ్ల పై గడిచిన కొన్ని నెలల్లో విపక్షాలు ఆందోళన చేయటం. ఆ తర్వాత దాన్ని వదిలేయటం తెలిసిందే. ఆ మధ్యన జగన్ సర్కారు రోడ్ల రిపేర్లకు భారీగా నిధులు కేటాయించినట్లుగా. రోడ్లు వేస్తున్నట్లుగా పేర్కొన్నారు. తాజాగా సోయం వ్యాఖ్యల్ని చూస్తుంటే. శివారు జిల్లాల్లో పరిస్థితులు మారలేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.