కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్...ఇరు తెలుగు రాష్ట్రాల్లో....ఆ మాటకొస్తే దేశ రాజకీయాల్లో కూడా ఈ పేరు సుపరిచితమే. ఉమ్మడి ఏపీ విభజన సమయంలో లగడపాటి పెప్పర్ స్ప్రే ఎపిసోడ్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఏపీ విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రాజగోపాల్...తాజాగా తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, లగడపాటి తాజాగా హైదరాబాద్ లో ఓ వివాదంలో చిక్కుకున్నారు. తన మిత్రుడి ఇంటిని తనిఖీ చేయబోతోన్న పోలీసులను రాజగోపాల్ అడ్డుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా, విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో లగడపాటి దురుసుగా ప్రవర్తించినట్లు వార్తలు వస్తున్నాయి.
హైదరాబాద్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్త జీ.పీ.రెడ్డి....పోలీసు అధికారికి చెందిన ఓ భూవివాదం కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగానే గురువారం రాత్రి ఆయన ఇంటికి పోలీసులు వచ్చారు. అయితే, ఆ సమయంలో అక్కడ ఉన్న రాజగోపాల్...సెర్చ్ వారంట్ లేకుండా తనిఖీ ఎలా చేస్తారని పోలీసులను అడ్డుకున్నారట. అంతేకాకుండా, వారిని ఇంటిలోకి రానివ్వకుండా ఆపేశారట. తన పై అధికారితో మాట్లాడుతున్న ఎస్సై దగ్గర నుంచి ఫోన్ కూడా లగడపాటి లాక్కున్నారని తెలుస్తోంది. తన మిత్రుడు విచారణకు సహకరిస్తున్నప్పటికీ...అర్ధరాత్రి తనిఖీలు చేపట్టడం ఏమిటని లగడపాటి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే, ఆల్రెడీ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సెర్చ్ వారంట్ లేకుండానే తనిఖీ చేయవచ్చని...పోలీసులు అంటున్నారు.