లవ్వర్ ని.. పెద్దలు చూపించిన అమ్మాయిని ఒకేసారి పెళ్లాడాడు

Update: 2020-07-11 04:30 GMT
అన్ని పెళ్లిళ్లు ఒకలా ఉండవన్న నానుడికి నిలువెత్తు రూపంగా తాజా ఉదంతాన్ని చెప్పాలి. నిజం చెప్పాలంటే.. ఇలాంటి పెళ్లిళ్ల గురించి అస్సలు విని ఉండం. రోటీన్ కు భిన్నంగా మారిన ఈ వివాహం హాట్ టాపిక్ గా మారటమే కాదు.. వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలో కెరియా అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో సందీప్ ఉకే అనే కుర్రాడు చదువుకుంటున్నాడు. తాను చదువుకునే రోజుల్లోనే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉంటే.. ఇంటి దగ్గరి వారు తమ కొడుక్కి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు.

దీంతో వ్యవహారం ఒక్కసారిగా చిక్కుముడి పడింది. తాను ప్రేమించిన అమ్మాయిని తప్పించి మరెవరినీ చేసుకునే ప్రసక్తే లేదని సందీప్ తేల్చేశాడు. తాము మాటిచ్చిన అమ్మాయితో కాకుండా.. మరొకరితో పెళ్లి చేసుకునేందుకు ససేమిరా అని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. దీంతో.. వ్యవహారం పంచాయితీగా మారింది. రచ్చబండకు వెళ్లిన ఈ ఉదంతంలో మూడు కుటుంబాల్ని ఒక దగ్గరకు చేర్చారు పెద్దలు. చివరకు ఇద్దరు అమ్మాయిలు తాము సందీప్ తో కలిసి ఉంటామని.. పెళ్లి చేయాలని కోరారు.

దీంతో.. ఈ ప్రతిపాదన అందరికి ఆమోదయోగ్యంగా ఉండటంతో.. తాజాగా వీరి పెళ్లి జరిగింది. మూడు కుటుంబాల వారు పెళ్లికి హాజరై కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. పెళ్లి కుమారుడికి.. పెళ్లి కుమార్తెల కుటుంబాలకు ఈ వివాహంపై ఎలాంటి అభ్యంతరాలు లేకపోవటంతో తాను పెళ్లి పెద్దగా వ్యవహరించినట్లుగా గ్రామపెద్ద పెళ్లికి ప్రధాన సాక్షిగా వ్యవహరించారు. ప్రేమించిన అమ్మాయిని.. పెద్దలు కుదిర్చిన అమ్మాయిని పెళ్లాడిన సందీప్ వ్యవహారం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
Tags:    

Similar News