నరసాపురం వైసీపీ ఎంపి రఘురామ కృష్ణంరాజు వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. అధికారపార్టీ ఎంపిగా ఉంటు ప్రభుత్వాన్నే విమర్శిస్తుంటారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెబుతునే మరోవైపు జగన్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో కేసు వేస్తారు. తాజాగా అమరావతి గురించి మాట్లాడుతు ‘రైతుల గొంతుకోసిన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్న’ట్లు చెప్పారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడురాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. జగన్ ప్రతిపాదనను టీడీపీతో పాటు ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపాదనపై జరుగుతున్న ఆందోళనలపైన కూడా అనేక విమర్శలున్నాయి. జరుగుతున్న దీక్షలు, ఆందోళనలు స్పాన్సర్డ్ అని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఈ విషయంలోనే అసెంబ్లీని రద్దుచేయాలని, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలని, ప్రజల రెఫరెండంను కోరాలనే అని చంద్రబాబునాయుడు అనేక డిమాండ్లు చేశారు.
ప్రజలందరు మళ్ళీ వైసీపీని గెలిపిస్తే తానిక రాజధాని డిమాండ్ పై మాట్లాడనని కూడా చంద్రబాబు బహిరంగంగా చెప్పారు. ఈ నేపధ్యంలోనే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ క్లాన్ స్వీప్ చేసేసింది. ఇదే విషయమై వైసీపీ నేతలు మాట్లాడుతూ ము రాజధానుల ప్రతిపాదనకు జనాలందరు తమకు మద్దతిచ్చినట్లే అని చెబుతున్నారు. ఎలాగంటే విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లలో వైసీపీని ఓడగొట్టమని చంద్రబాబు పదే పదే ప్రచారం చేశారు.
పై రెండు కార్పొరేషన్లో వైసీపీని గెలిపిస్తే మూడు రాజధానులకు మద్దతిచ్చినట్లే అవుతుందని కూడా చంద్రబాబు చెప్పారు. అయితే చంద్రబాబు మాటలను పట్టించుకోని జనాలు రెండు కార్పొరేషన్లలో వైసీపీనే గెలిపించారు. అప్పటినుండి మూడు రాజధానులకు జనాల మద్దతుందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే అమరావతి 500వ రోజు ఆందోళనపై ప్రతిపక్ష నేతలు స్పందించారు.
ఈ సందర్భంలో వైసీపీ తిరుగుబాటు ఎంపి కృష్ణంరాజు అధికారపార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నట్లు చెప్పారు. వైసీపీ ఎంపిగా గెలిచి ప్రభుత్వంపైన+జగన్ పైన ఆరోపణలు, విమర్శలు చేయటాన్ని అధికారపార్టీ నేతలు తప్పుపడుతున్నారు. ఎంపి పదవితో పాటు పార్టీకి కృష్ణంరాజు వెంటనే రాజీనామా చేయాలని చాలాకాలంగా డిమాండ్లు చేస్తున్నా ఆ విషయాన్ని మాత్రం తిరుగుబాటు ఎంపి పట్టించుకోవటంలేదు.
ప్రభుత్వం నిర్ణయాలు నచ్చకపోతే వెంటనే ఎంపి రాజీనామా చేయాలేకానీ సిగ్గుపడాల్సిన అవసరం లేదని తాజాగా తిరుగుబాటు ఎంపిపై మళ్ళీ అధికారపార్టీ నేతలు దాడలు మొదలుపెట్టారు. ఎంపిగా రాజీనామా చేయటం వల్ల నరసాపురంలో వచ్చే ఉపఎన్నికలో పోటీచేసి గెలవాలని వైసీపీ నేతలు చాలెంజ్ చేస్తున్నారు. అయితే ఈ చాలెంజ్ కు ఎంపి స్పందించటంలేదు.