సినిమా టికెట్ల విషయంలో దురుసుగా మాట్లాడుతున్న ఏపీ మంత్రి పేర్ని నానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గట్టి కౌంటర్ ఇచ్చారు. 300 కోట్ల ఆర్ఆర్ఆర్ సినిమాకు.. రూ. కోటి పెట్టి తీసే సినిమాకు ఒకటే రేటు ఎలా నిర్ణయిస్తారని నిలదీశారు.
మీ పల్లె వెలుగు బస్సు, డీలర్స్, ఏసీ బస్సుల్లో రేట్లు ఎందుకు ఒకేలా లేవు అని మంత్రి పేర్ని నానికి ఎంపీ రఘురామ కౌంటర్ ఇచ్చారు. అసలు ఎవరో ప్రైవేటు వ్యక్తులు సినిమాలు తీసి.. ప్రైవేటు థియేటర్లలో ప్రదర్శిస్తే మీ పెత్తనం ఏంటని ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రేక్షకులే రూ.100 పెట్టి కొని సినిమా చూస్తామంటే ధరలు తగ్గించి వారిని అవమానిస్తున్నారని.. సినీ ఇండస్ట్రీని ఏడిపిస్తున్నారని ఎంపీ రఘురామ నిప్పులు చెరిగారు. ప్రశ్నించిన హీరోలు సిద్ధార్థ్, నానిలపై విరుచుకుపుడతారా? అంటూ కడిగేశారు. హీరోలు ప్రశ్నించిన దాంట్లో తప్పేంటని నిలదీశారు.
రూ.5 పెట్టి టికెట్ కొని సినిమా చూస్తే పక్కన కిరాణా కొట్టు వాడికంటే థియేటర్లకే తక్కువ ఆదాయం వస్తుందన్న హీరో నానిపై విరుచుకుపడుతారా? అందులో వాస్తవం లేదా? అని నిలదీశారు. అసలు ఏపీ ప్రభుత్వం ప్రజల కోసం ఈ టికెట్లు రేట్లు పెట్టిందంటోందని.. కానీ ప్రజలు కూడా ఇంత తక్కువ పెట్టి సినిమా చూసేందుకు ఆసక్తి చూపడం లేదని ఎంపీ రఘురామ చెప్పుకొచ్చారు.
ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు ఉండాలని.. కానీ వారు వ్యతిరేకించినా అలా అమలు చేస్తున్నారని.. వైసీపీ ఓసారి ప్రశ్నించుకోవాలని ఎంపీ రఘురామ ప్రశ్నించారు. మీ సిమెంట్ కంపెనీల్లో 43,53 గ్రేడ్ సిమెంట్ పేరిట వివిధ రేట్లు నిర్ణయించే ఏపీ ప్రభుత్వ పెద్దలు.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ కు మాత్రం తక్కువ రేట్లు నిర్ణయిస్తారా? అని ప్రశ్నించారు.
సినిమా ఇండస్ట్రీని కొట్టి ప్రజలకు పెడితే వారు హర్షించరని ఎంపీ రఘురామ విమర్శించారు. పేర్ని నాని, ఎంపీ జగన్ లు నటిస్తే సినిమాలు చూడరని.. మన హీరోలు, దర్శకులు చేస్తేనే చూస్తారని.. వారికి తగ్గ రెమ్యూనరేషన్లు ఇవ్వాలని..దాని కోసం రేట్లు పెంచితే.. షోలు పెంచుకుంటే తప్పేంటని నిలదీశారు. రూ.5కే సినిమా చూపించాలంటున్న ఏపీ ప్రభుత్వానికి అసలు హక్కు ఎక్కడిదని నిలదీశారు. అసలు టికెట్ రేటు నిర్ణయించడానికి ఏపీ ప్రభుత్వానికి హక్కే లేదని స్పష్టం చేశారు.
Full View