కేసీఆర్ త‌ర్వాతి విజిట్‌.. విశాఖ‌ప‌ట్నం

Update: 2017-06-05 09:29 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ది కాస్త భిన్న‌మైన వ్య‌వ‌హారం. ఆయ‌న చాలా సంద‌ర్భాల్లో ఇల్లు క‌ద‌ల‌రు. ఉద్య‌మ‌నేత‌గా ఉన్న రోజుల్లో కూడా ఆయ‌న చాలా త‌క్కువ‌గానే బ‌య‌ట‌కు వ‌చ్చేవారు. మిగిలిన ఉద్య‌మ‌నేత‌ల మాదిరి అదే ప‌నిగా రోడ్ల మీద‌కు రావ‌టం.. హ‌డావుడి చేయ‌టం అనేది ఉండేది కాదు.

ఉద్య‌మ‌నేత‌గా ఆయ‌న ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో.. ముఖ్య‌మంత్రిగా కూడా దాదాపు అంతే. ఏదైనా ప్రోగ్రాం పెట్టుకుంటే బ‌య‌ట‌కు రావ‌ట‌మే కాదు.. అదే ప‌నిగా ప‌ర్య‌ట‌న‌లు చేయ‌టం.. ఢిల్లీకి ప్ర‌యాణాలు క‌ట్ట‌టం.. విదేశాల్లో ప‌ర్య‌టించ‌టం లాంటివి అస్స‌లు చేయ‌రు. ఎవ‌రైనా త‌న ద‌గ్గ‌ర‌కు రావాలే త‌ప్పించి.. త‌న‌కు తానుగా వెళ్లే తీరు ఆయ‌న‌లో త‌క్కువ‌గానే క‌నిపిస్తుంటుంది.

అలాంటి కేసీఆర్ బ‌య‌ట‌కు కాలు అడుగుపెట్ట‌టం.. అందునా ఏపీకి వెళ్ల‌టం అంటే మామూలు విష‌యం కాదు. అందులో ఏదో ఒక విశేషం త‌ప్ప‌నిస‌రి. నిజ‌మే.. కేసీఆర్ వైజాగ్ టూర్ లో విశేషం ఉంద‌ని చెప్పాలి. కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహిత మిత్రుడు.. దివంగ‌త మాజీ కేంద్ర‌మంత్రి ఎర్ర‌న్నాయుడు కుమారుడు.. ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు వివాహ వేడుక‌కు కేసీఆర్ హాజ‌రు కానున్న‌ట్లుగా చెబుతున్నారు.

త‌న పెళ్లికి రావాల్సిందిగా కోరుతూ.. రామ్మోహ‌న్ నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను క‌ల‌వ‌టం.. ఆయ‌న‌కు ఆహ్వాన‌ప‌త్రిక ఇవ్వ‌టం తెలిసిందే. ఈ నెల‌లో విశాఖ‌లో జ‌రిగే రామ్మోహ‌న్ నాయుడు పెళ్లికి కేసీఆర్ వెళ్ల‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. 30 ఏళ్ల ఈ యువ ఎంపీకి.. పెందుర్తి ఎమ్మెల్యే బండారు స‌త్య‌నారాయ‌ణ కుమార్తె శ్రావ్య‌తో పెళ్లి నిశ్చ‌య‌మైన విష‌యం తెలిసిందే. కేసీఆర్ ఏపీకి వ‌స్తున్నారంటే తెలీని ఆస‌క్తి  ఏపీ ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మ‌వుతుంటుంది. మ‌రి ఈసారి ఏమ‌వుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News