‘స్వామిజీలు ఏమి తినాలో.. ఏమి తినకూడదో చెప్పడానికి నువ్వెవరు..? మీ ఇంటికి ముస్లింలను పిలిచి పంది కూర మాంసం పెట్టి తినిపిస్తావా.. హంసలేఖ..? అంటూ కర్ణాటక ఎంపీ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలో కలకలం రేపింది. అయితే అంతకుముందు పేజావర్ స్వామిజీ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ ప్రతాప్ సింగ్ ఇలా కౌంటర్ ఇచ్చారు. ఆహారం విషయంలో మీరు ఉచిత బోధనలు ఇవ్వాల్సిన అవసరం లేదని సంగీత దర్శకుడిపై ఎంపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి..? సంగీత దర్శకుడు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు..?అసలు వివాదం ఎక్కడ మొదలైంది.
కర్ణాటకకు చెందిన ఉడిపి పేజావర్ స్వామిజీ ప్రజల మధ్య తారతమ్యాలు ఉండకూడదని ప్రజలంతా ఒక్కటేనని చెబుతారు. సమాజంలో ఎవరూ ఎవరిపై వేలెత్తి చూపాల్సిన అవసరం లేదని అంటారు. ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ కాదని అందరూ సమానమే అని అంటారు. ఒకరిది ఎక్కువ కులం.. ఒకరది తక్కువ కులం కాదని, అందరూ ఒకే కులానికి చెందిన వారంటారు. దీంతో ఆయన ప్రసంగాన్ని వినేందుకు చాలా మంది భక్తులు ఆశ్రమానికి తరలివస్తుంటారు. అయితే కేవలం ప్రసంగం ద్వారానే కాకుండా కొన్ని పనుల వల్ల సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు స్వామిజీ ప్రయత్నించారని కొందరు భక్తులు పేర్కొంటారు. ఇందులో భాగంగా పేజావర్ స్వామిజి ఒకసారి దళితుల ఇంటికి వెళ్లారు. వారితో కలిసి మెలిసి మెలిగారు.
అయితే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, గీత రచయిత హంసలేఖ స్వామిజీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ ఆహారం ఆరగించే పద్ధతులు ఒకే విధంగా పాటిస్తే సమాజంలో ఎలాంటి తారతమ్యాలు ఉండవన్నారు. గతంలో దళితుడి ఇంటికి వెళ్లిన స్వామిజి ఆహారం సేవించే విషయంలో వెనుకా, ముందు ఆలోచించారన్నారు. దళితులు మాంసం తింటారనే పేజావర్ స్వామిజీ వారి ఇంట్లో ఆహారం తినడానికి ఆలోచించారన్నారు. అయితే మనుషుల మధ్య ఆహారం విషయంలో తారతమ్యాలు లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మాంసాహారం తింటే సరిపోతుందని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ హంసలేఖ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇందలో భాగంగా మైసూర్ బీజేపీ ఎంపి ప్రతాప్ సింహ ఫైర్ అయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్ హంసలేఖను అనుసరిస్తూ ‘మీరు ఇచ్చిన ఉచిత సలహా బాగుంది. అయితే మీరు ముందుగా మీ ఇంటికి ముస్లిం సోదరులను ఆహ్వానించి వారికి పంది మాంసంతో వంటలు చేసి పెట్టండి. వారు పంది మాంసం తింటారా..? తినరా..? అనే విషయం పక్కాగా తెలుసుకున్న తరువాత మిగతా వారికి ఉచిత సలహాలు ఇవ్వండి’ అని అన్నారు.
‘మీరన్నట్లు ఆహారం విషయంలో ఒకే పద్దతి పాటించాలని అనుకుంటే ముస్లింలు పంది మాంసం ఎందుకు తినరు.. హంసలేఖా..? అని ప్రశ్నించారు. మీకు చేతిలో సినిమాలు లేనట్లున్నవి. అందుకే మిమ్మల్ని పట్టించుకోవడం మానేశారు. దీంతో మీకేం చేయాలో తోచక ఇలాంటి ఉచిత సలహాలు ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. ఫ్రీ పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికదాని అన్నారు. స్వామీజీలు, సన్యాసులు పూర్తిగా శాఖాహారులు అని మీకు తెలియదా..? బుద్దిలేకుండా ఎలా మాట్లాడుతారు..? అని మండిపడ్డారు. ‘ దివంగత ఉడిపి పేజావర్ స్వామిజి అందరి స్వామిజీలు లాగా కాదు... ఆయనకు కోట్ల మంది భక్తులు ఉన్నారు. అలాంటి స్వామిజీ గురించి ఇలా మాట్లాడడం సరికాదు..’ అని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.