కొన్నాళ్ళుగా ఫామ్ లేక సతమతమవుతున్న మాజీ కెప్టెన్ ధోనీ ఫామ్ లోకి వచ్చాడు. బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్‌పై వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డే లో ఈ ధనాధన్ బ్యాట్స్ మెన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.79 బంతుల్లో 78 పరుగులు చేసి బ్యాట్స్‌మెన్‌గా తన సత్తా చాటాడు. తన ఇన్నింగ్స్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.
ఈ సందర్భంగా కామెంటరేటర్ అడిగిన ప్రశ్నకు ధోనీ చమత్కారంగా సమాధానమిచ్చాడు. 'వయసు పైబడుతున్న కొద్దీ బాగా ఆడుతున్నావు... ఇది ఎలా సాధ్యం' అని కామెంటేటర్ ప్రశ్నించాడు. 'నేను వైన్ లాంటి వాడిని' అంటూ ధోనీ సమాధానమిచ్చాడు. వైన్ ఎంత ఓల్డ్ అయితే అంత కిక్ ఉంటుంది కదా. అలాగే వయసు పెరిగినా తన ఆటలో కిక్ తగ్గదని ధోనీ చెప్పకనే చెప్పాడు.
కొద్దిరోజుల క్రితం ధోనీ, యువరాజ్‌లపై రాహుల్ ద్రవిడ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. రాబోయే వరల్డ్ కప్ నాటికి వారిద్దరికీ ప్రత్యామ్నాయాలు వెతకాల్సిందిగా బీసీసీఐకి రాహుల్ సూచించాడు. ఈ నేపథ్యంలో ధోనీ వైన్ వ్యాఖ్య ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అంటే తాను 2019 వరల్డ్ కప్ దాకా కొనసాగుతానని ధోనీ చెప్పకనే చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/