టీమిండియా కెప్టెన్ భారీ సాహసాన్ని చేసేశారు. పదివేల అడుగుల ఎత్తు నుంచి ప్యారాచూట్ జంప్ చేసేశారు. ఆర్మీ శిక్షణ లో భాగంగా ఆయన మొత్తం ఈ విధంగా నాలుగు సార్లు చేయాల్సి ఉంటుంది. గత రెండు వారాలుగా ఈ ఫీట్ సాధించేందుకు ఆయన శిక్షణ పొందుతున్నారు.
ఎట్టకేలకు బుధవారం ఉదయం ఆయన ఏఎస్ 32 ఆర్మీ విమానం నుంచి భూమికి పదివేల అడుగుల ఎత్తులో.. విమానం నుంచి ప్యారాచూట్ సాయంతో దూకేశారు.
టీమిండియా కెప్టెన్ గా.. సెలెబ్రిటీ ప్రముఖుడిగా ఉన్న ధోని.. ఈ సాహసానికి వెనక్కి తగ్గకుండా.. ఉత్సాహంగా పాల్గొనటం ఒక విశేషం. ప్రస్తుతానికి ఒక జంప్ చేసిన ధోని.. మరో నాలుగు జంప్ లు చేయాల్సి ఉంది. 2011లో భారత సైన్యంలో గౌరవ లెఫ్టెనెంట్ హోదాలో చేరిన ధోని ప్రస్తుతం లెఫ్టెనెంట్ హోదాలో ఉన్నారు. మొత్తానికి సాహసానికి వెనుకంజ వేయకుండా.. భారీ ఫీట్ చేసిన ధోనిని పలువురు ప్రశంసిస్తున్నారు.