ఇండియాలో క్రికెట్ అన్నా - క్రికెటర్లు అన్నా ఉన్నా అభిమానం గురించి కొత్తగా మాట్లాడుకునేదేమీ లేదు. ఆ అభిమానానికి హద్దులు లేవు. అయితే.. కొద్దికాలంగా ఆ అభిమానం కాస్తా దురభిమానంగా మారిపోతుండడమే ఆందోళనకంగా మారుతోంది. తమ అభిమాన ఆటగాళ్ల గురించి ఎవరు ఏం మాట్లాడినా సహించలేకపోతున్నారు. చివరకు తాము అభిమానించే ఇతర క్రికెటర్లనూ వారు వదిలిపెట్టడం లేదు. గతంలో వరల్డ్ కప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో ఓడిపోయినప్పుడో లేదంటే పాకిస్థాన్ చేతిలో ఓడిపోయినప్పుడో మాత్రమే అభిమానులు ఆగ్రహించేవారు. అది కూడా ఎక్కువ సందర్భాల్లో మైదానం వద్ద మాత్ర ఆ ఆగ్రహం కనిపించేది. కానీ.. ఒకట్రెండు సందర్భాల్లో క్రికెటర్ల ఇళ్ల వద్ద దాడులకు - ధర్నాలకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. తమ అభిమాన ఆటగాళ్లను విమర్శిస్తే తట్టుకోలేని అభిమానులు.. ఇప్పుడు కొత్తగా వేరేవాళ్లను పొగిడినా కూడా తట్టుకోలేకపోతున్నారు. తాజాగా స్పిన్నర్ హర్భజన్ సింగ్ కు అలాంటి అనుభవమే ఎదురైంది. గంగూలీని పొగిడిన పాపానికి భజ్జీపై ధోనీ అభిమానులు దాడి చేశారు.
టీమిండియా కెప్టెన్లలో అత్యుత్తమ సారధి ఎవరు? అన్న ప్రశ్నకు ఎప్పటి నుంచో చర్చల్లో ఉంది. అప్పుడెప్పుడో కపిల్ దేవ్ నుంచి ఆ తరువాత అజారుద్దీన్.. గంగూలీ.. చివరకు ధోనీ వరకు పేర్లు వినిపిస్తాయి. అయితే.. ఎక్కువగా గంగూలీ - ధోనీ మధ్యే ఈ విషయంలో పోటీ ఉంది. ఇండియన్ క్రికెట్ కు జోష్ - దూకుడు - విజయాలు అన్నీ నేర్పించింది గంగూలీయే అని ఆయన అభిమానులు అంటే ధోనీ అభిమానులు మాత్రం గంగూలీ కంటే ధోనీ కెప్టెన్సీ రికార్డులే ఘనం అంటారు. అయితే.. గంగూలీ వేసిన దారిలోనే ధోనీ నడిచాడని గంగూలీ అభిమానులు చెబుతారు.
ఇలా ఎప్పటినుంచో కెప్టెన్సీ సత్తాపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. టీమిండియా క్రికెటర్లూ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తారు. విజయాల పరంగానే కాకుండా - ఐసీపీ ప్రపంచ కప్ లను సాధించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీనే అందరిలోకి బెస్ట్ కెప్టెన్. ఇదే ధోనీ ఫ్యాన్సు భావన. అయితే నిన్న టీమిండియా కెప్టెన్ గా తనదైన శైలిలో రాణించి ప్రశంసలు అందుకున్న సౌరవ్ గంగూలి జన్మదినాన్ని పురస్కరించుకుని స్పిన్నర్ హర్భజన్ సింగ్ అతడిని టీమిండియా కెప్టెన్లలో అత్యుత్తమ కెప్టెన్ గా అభివర్ణించాడు. దీనిపై కెప్టెన్ కూల్... కూల్ గానే ఉన్నా అతడి అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోయారు. సహనం ఉన్న కొందరు భజ్జీ కామెంట్ పై సోషల్ మీడియాలో సెటైర్లు సంధిస్తే... మరి కొందరు మాత్రం భజ్జీ కార్యాలయంపై దాడికి దిగారు. దీంతో భజ్జీ ఇదెక్కడి గొడవరా నాయనా అనుకుంటూ తలపట్టుకున్నాడట. క్రికెట్ పరిశీలకులు మాత్రం గంగూలీ - ధోనీలు ఇద్దరూ గొప్పోళ్లే కానీ అభిమానులే గొప్పగా ఉండడం లేదంటున్నారు.