తనకు జనసేన అధినేత ఎవరో తెలియదన్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్ కు ఓ సలహా ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్న పవన్ కల్యాణ్ కు తన జాతి సంపూర్ణ మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.
గతంలో సీఎం చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు ప్రకటించిన సందర్భంగా నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ముద్రగడ పద్మనాభం .. పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని, ఆయనతో తనకు పరిచయం లేదని వ్యాఖ్యానించారు.
అయితే తిరుపతిలో జరిగిన బలిజల ఆత్మీయ కలయిక లో పాల్గొన్న ముద్రగడ ప్రత్యేక హోదా సాధించాలంటే పవన్ కల్యాణ్ బలం సరిపోదు. సీఎం చంద్రబాబు తన పార్టీకి చెందిన ఎంపీలు - ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రత్యేక హోదా సాధనకు పోరాడాలని సూచించారు. ఇందుకోసం కాపు జాతి మద్దతు తెలుపుతుందని ప్రకటించారు.
కాపుల రిజర్వేషన్లలో చంద్రబాబు జాప్యం చేయడం వల్లే మూలన పడ్డాయని అన్నారు. ఇచ్చిన హామీల్నీ చంద్రబాబు నెరవేర్చుకోవాలని, రాష్ట్రంలో జరగబోయే నియామకాల్లో బీసీ ఎఫ్ ద్వారా కాపులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఒక వేళ కాదు కూడదు అని చంద్రబాబు అంటే ఎలా ఆకలి తీర్చుకోవాలో మాకు బాగా తెలుసని - సీఎం కు బుద్ధి చెప్పేలా ఉద్యమం చేసి తగిన గుణపాఠం చెబుతామని సూచించారు. మాజాతిని మోసం చేయాలని చూస్తే చంద్రబాబును ఎలా వెన్నుపోటు పొడవాలో నిర్ణయిస్తామన్నారు.