కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి గళం విప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆయన తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. రెండు పడవల మీద కాళ్లు పెట్టటం ద్వారా సక్సెస్ కాలేరని తేల్చి చెప్పిన పవన్.. సినిమా.. రాజకీయాలనే రెండు పడవల మీద కాళ్లు పెట్టకూడదన్నారు. ఎన్టీఆర్ మాదిరి పవన్ రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే ప్రజల్లో ఉండాలని.. వారిలో విశ్వాసం కలిగించాలని సూచించారు.
సినిమా వాళ్లు రాజకీయాల్లో నెగ్గరని.. అదొక్క ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమవుతుందన్నారు. తొమ్మిది నెలల పాటు ఎన్టీఆర్ ప్రజల్లో ఉండటం వల్ల రాష్ట్ర ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారన్న ముద్రగడ.. పవన్ ఓ మహా వృక్షం నీడలో ఉన్నారని.. దాని నుంచి బయటకు రావాలన్నారు. బీజేపీ నుంచి బయటకు వస్తే కానీ పవన్ ఎదగలేరన్న ఆయన తాను ఏపార్టీలో కానీ.. ఎవరి మద్దతు కానీ ఇవ్వనని స్పష్టం చేశారు.
తనకు ఐదు కోట్ల ఆంధ్రుల కంటే తన జాతి ప్రజలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. తన జాతి ప్రజల ప్రయోజనాల కోసం తాను దేనికైనా తెగిస్తానని చెప్పిన ముద్రగడ.. తన జాతికి ఎవరు న్యాయం చేస్తారో వారికి మాత్రమే తన మద్దతు ఉంటుందని చెప్పారు.
ఎన్నికల వేళ తమకు ఇచ్చిన హామీల్ని చంద్రబాబు విస్మరించారని.. రానున్నఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెబుతామన్నారు. కాపు జాతి ప్రయోజనాల కోసం తాను మరో పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తగిన కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. ముద్రగడ మాటలు చూస్తుంటే.. బాబు సర్కారును ఉక్కిరిబిక్కిరి చేసే మరో వ్యూహాన్ని కాపు ఉద్యమనేత ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపించకమానదు.