సీఎం పట్ల అభిమానం ఉండాల్సిందే. రాజ్యాంగం ప్రకారం.. ఉన్నతస్థాయి ప్రకారం గౌరవమూ ఉండా ల్సిందే. అయితే.. తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు.. తమ డిమాండ్లను సాధించేందుకు ఒకింత ధైర్యం.. తెగువ.. అంతకుమించిన డెసిషన్ మేకింగ్ కూడా అవసరమే కదా! ఇది లేకపోతే.. ఎలా? అనేది ఇప్పుడు కాపు సామాజిక వర్గం ప్రశ్న. ఎందుకంటే.. తాజాగా కాపు ఉద్యమ మాజీ నాయకుడు.. ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు.
సాధారణంగా.. ఎవరైనా లేఖలు రాయొచ్చు. ఇటీవల కాలంలో మాజీ సీఎం చంద్రబాబు నుంచి కమ్యూని స్టు నాయకుల వరకు కూడా అందరూ లేఖలు రాస్తున్నారు. ఈ క్రమంలో వారి డిమాండ్ల సాధనకు పదు నైన భావజాలాన్ని.. అంతకు మించిన కామెంట్లతో సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తున్న విషయం తెలిసిందే.
అయితే, ముద్రగడ మాత్రం బ్రతిమాలుకుని.. బామాలుకుంటున్నట్టుగా వ్యాఖ్యానించడమే ఇప్పుడు కాపు వర్గంలో చర్చకు దారితీసింది.
టీడీపీ హయాంలో కాపుల రిజర్వేషన్ కోసం.. ముద్రగడ ఎంత యుద్ధం చేశారో తెలిసిందే. ఈ క్రమంలోనే 2019 ఎన్నికలకు ముందు కేంద్రం ఇచ్చిన సౌకర్యం నేపథ్యంలో ఈడబ్ల్యుఎస్ కోటాలో 5 శాతం కాపులకు వర్తింపజేస్తూ.. చంద్రబాబు తీర్మానం చేశారు. అయితే.. దీనిని అమలు చేసేలోపు ఎన్నికలు వచ్చాయి. దీంతో.. కాపులు ఆగ్రహంతో ఊగిపోయారు. అయితే.. తర్వాత వచ్చిన జగన్ దీనిని పూర్తిగా పక్కన పెట్టారు.
అయితే.. ఇప్పుడు కేంద్రం కూడా దీనికి ఓకే చెప్పడం.. ఎలాంటి ఇబ్బందులు లేవనడం..ఈడబ్ల్యూఎస్ కోటాను సుప్రీం కోర్టు కూడా.. సమర్ధించిన నేపథ్యంలో జగన్‌ను దీనిని అమలు చేయాలని కోరుతూ.. ముద్రగడ లేఖ రాశారు. వాస్తవానికి ఆయన గతంలో చంద్రబాబుకు కూడా లేఖలు రాశారు. కానీ, అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే.. అప్పట్లో'' మీరు ఎందుకు చేయరు.
మేం ఎన్నికల్లో ఇచ్చిన హామీనే కదా అడుగుతున్నాం'' అని బెదిరింపు ధోరణిలో అడిగితే..ఇప్పుడు మాత్రం దీనికి భిన్నంగా.. ప్లీజ్.. ప్లీజ్.. అంటూ.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదంటూ.. బ్రతిమాలు కోవడం కనిపించింది. దీనిని బట్టి ముద్రగడ కూడా.. భయపడుతున్నారా? అనే చర్చ తెరమీదకి రావడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.