ఉద్యమాన్ని ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? చేస్తే.. దాని తీరు తెన్నులు ఎలా ఉండాలి? అన్నవి ప్రధాన ప్రశ్నలు. ఎవరైనా.. ఏదైనా విషయం మీద ఉద్యమం చేస్తున్నారన్న వెంటనే.. వారు కోరిన కోర్కెల్ని తీర్చేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉండవు. మరి.. పాలకుల మెడలు వంచి.. తాము అనుకున్న డిమాండ్లు సాధించాలంటే ఓర్పు.. నేర్పు తప్పనిసరి. డిమాండ్ల సాధన అన్నది ఒక్కరోజులో పూర్తి కాదు. కొన్నిసార్లు సుదీర్ఘ కాలమే పట్టొచ్చు. తెలంగాణ ఉద్యమమే దీనికి నిదర్శనం. తెలంగాణ ఉద్యమం కేసీఆర్ తో మొదలు కాలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు.
కేసీఆర్ కు ముందు ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. ఆ మాటకు వస్తే.. కేసీఆర్ ఉద్యమం చేసిన సమయంలోనూ వందలాది మంది ప్రాణాలు అర్పించారు. ఉద్యమం సందర్భంగా కేసీఆర్ ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు. అవమానాలు పొందారు. బాధనలు అనుభవించారు. ఒక దశలో ఉనికి కూడా ప్రమాదం పొంచి ఉందన్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సమయాల్లోనూ ఆయన ఎక్కడా రెచ్చిపోలేదు. తన టైం కోసం ఎదురుచూసి.. సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని తాను అనుకున్నది సాధించారు.
తెలంగాణ ఇచ్చే అవకాశం ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాను ఉద్యమం సందర్భంగా పల్లెత్తు మాట అనలేదు. అందరూ ఆమెను దెయ్యంగా అభివర్ణిస్తూ.. విరుచుకుపడితే.. కేసీఆర్ మాత్రం దేవతగా కొలిచారు. ఆమె చేతుల్లోనే తెలంగాణ నిర్ణయం ఉందన్న మాటను పదే పదే వినిపించారు. ఆయన చెప్పినట్లే.. సోనియమ్మకు తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితులు కల్పించారు. తెలంగాణను సాధించుకునే సమయంలో సోనియాను కేసీఆర్ ఎలా వాడేశారో అందరికి తెలుసు. తెలంగాణ సాధన తర్వాత దేవతగా కీర్తించిన సోనియమ్మను ఎలా ట్రీట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక్కడ చెప్పేదేమంటే.. ఉద్యమ సమయంలో భావోద్వేగానికి గురయ్యేలా చేయాలే కానీ.. నడిపించే నాయకుడు భావోద్వేగానికి గురి కాకూడదు. ఒకవేళ అయితే.. కాపు నేత ముద్రగడ పరిస్థితిలానే ఉంటుంది. తెలంగాణలో పోలిస్తే ఏపీలో ఉద్యమాలు తక్కువ. అరుదుగా జరిగే ఉద్యమాలు.. అనుకున్నవి సాధించినవి చాలా తక్కువ. ఎందుకంటే.. ఉద్యమాల్లో ఆవేశం ఎక్కువగా ఆలోచన తక్కువగా ఉండటమే కారణం. పుబ్బలో పుట్టి ముఖలో ముగిసే ఉద్యమాలే ఎక్కువ.
ఉద్యమాల సందర్భంగా భావోద్వేగం పీక్ స్టేజ్ లోకి వెళ్లటం.. అమాంతం కిందపడి చతికిల పడటం చాలా ఉద్యమాల్లో చూస్తున్నదే. ఎందుకంటే.. భావోద్వేగం తీవ్రస్థాయిలోకి తీసుకురావటం ఎంత తేలికో.. దాన్ని అలానే నిలపటం అంత కష్టం. ఆ విషయాన్ని ముద్రగడ మర్చిపోతున్నారు. తాను పిలిస్తే కాపులు మరుక్షణం స్పందిస్తున్నారన్న భావనలో ఉన్న ఆయన.. అంతిమంగా ఫలితం కోసం చూస్తారని.. అందులో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉందన్న విషయాన్ని ముద్రగడ మర్చిపోవటమే అసలు సమస్య.
ఉద్యమం చేసే వారు అన్ని వర్గాలకు ఆమోద యోగ్యంగా నడుచుకోవాల్సి ఉంటుంది. అందరిని కూడగట్టుకుంటే ఆ డిమాండ్ చాలా త్వరగా తీరే వీలుంది. గతంలో కాపుల ఉద్యమానికి సారధ్యం వహించి.. తర్వాత చప్పుడు చేయకుండా ఉండిపోయిన ముద్రగడ ఉన్నట్లుండి మళ్లీ యాక్టివ్ కావటం మంచిదే. కానీ.. డిమాండ్ల సాధనకు ఉత్సాహంతో పని చేయాలే కానీ అత్యుత్సాహంతో మొదటికే మోసం తెచ్చుకోకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు. కేసీఆర్ చేసిన ఉద్యమాన్ని ఒక్కసారి చూసి.. పాఠాలు నేర్చుకుంటే బాగుంటుందేమో ముద్రగడ?