కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన నిరసన దీక్ష ఏపీ సర్కారు ఎంతగా ఉక్కిరిబిక్కిరి అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మధ్యన రత్నాచల్ దగ్థం కేసులో అరెస్ట్ చేసిన వారి కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి.. తాను పట్టిన పట్టు వదలకుండా.. వారిని బయిల్ మీద బయటకు తీసుకొచ్చి.. తానెంత మొండిఘటమన్న విషయాన్ని తన చేతలతో చెప్పేశారు ముద్రగడ. అలాంటి ఆయన దీక్ష విరమణ తర్వాత పెద్దగా మాట్లాడింది లేదు.
తాజాగా.. ఆయన మరోసారి తెర మీదకు వచ్చేశారు. ప్రత్యేక హోదా అంశంపై ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా మారిన వేళ.. ఆయన తనదైన శైలిలో గళం విప్పారు. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం వైఖరికి నిరసనగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ.. ఆయన కుమారుడు లోకేశ్ కానీ ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారా? అని సూటి ప్రశ్న వేశారు. చంద్రబాబు.. లోకేశ్ ఇద్దరూ కానీ ఆమరణ నిరాహార దీక్ష కానీ చేపడితే తాను కూడా వారితో కలిసి దీక్షలో కూర్చుంటానని చెప్పిన ఆయన.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక బహిరంగ లేఖ రాశారు.
తాను విసిరిన సవాలుకు చంద్రబాబు ఓకే అంటే రెండు సందేహాలు తీరిపోతాయన్న ముద్రగడ.. ఏపీకి ప్రత్యేక హోదాపై బాబుకున్న చిత్తశుద్ధి తెలియటంతో పాటు.. తమలో ఎవరు ఎక్కువ రోజులు దీక్ష చేయగలరన్న విషయం కూడా తేలుతుందన్నారు. కాపు రిజర్వేషన్ కోసం తాను చేపట్టిన దీక్షపై తన అనుచరులతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించారన్న ఆయన.. కాపుల కోసం పోరాడేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఇప్పటివరకూ ఏ రాజకీయ నేత.. ఉద్యమనేత విసరని విధంగా ఏపీ ముఖ్యమంత్రికి ముద్రగడ సవాలు విసిరారని చెప్పాలి.