ముద్రగడ పద్మనాభం అంటేనే క్రేజ్ ఉన్న నాయకుడు. ఆయన ముఖ్యమంత్రి చేశారా, దేశాలు ఏలారా అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. ఆయనకు ఉన్న కమిట్మెంట్, నీతి నిజాయతీయే కొలమానంగా అంతా చూస్తారు. ఆయన తాను కాపులకు మాత్రమే ప్రతినిధిని అని చెప్పుకున్నా కూడా అందరి వారు అయ్యారూ అంటేనే ఆయన హద్దులను దాటిన ప్రేమను జనాల నుంచి సంపాదించుకున్నారని అర్ధం చేసుకోవాలి. ఇక కాపు ఉద్యమం నుంచి పక్కకు తప్పుకుని ముద్రగడ బహుజనుల నేతగా మారేందుకు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అంతా ఒక్కటి కావాలంటూ ఈ మధ్యనే ఒక బహిరంగ లేఖ రాసి సంచలనం రేపారు. ముద్రగడ లేఖ ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున కలకలం రేపింది. అదే టైమ్ లో ఆయన ఎటు వైపు ఎవరి వాడు ఆయన ముందున్నది ఎవరు వెనకున్నది ఎవరూ అన్న చర్చ కూడా వాడిగా వేడిగా సాగుతోంది. దానికి కారణం ఏపీలో ఇపుడున్న రాజకీయ వాతావరణమే.
వైసీపీ అధికారంలో ఉంది. విపక్షంలో ఉన్న టీడీపీ అధికారం చేపట్టాలని ఉవ్విళ్ళూరుతోంది. జనసేనను దగ్గరకు తీసుకుని మరోమారు పవర్ లోకి రావాలని బాబు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ముద్రగడ బహుజన ఫ్రంట్ అన్నది విపక్షంలోనే కలవరం రేపుతోంది అన్నది వాస్తవం. వైసీపీ వర్సెస్ టీడీపీ అంటేనే రాజకీయం పండుతుంది. వైసీపీ యాంటీ ఓటింగ్ అంతా వచ్చి టీడీపీ కూటమి బుట్టలో పడుతుంది.
అయితే మధ్యలో ముద్రగడ వచ్చి బహుజన ఫ్రంట్ పేరిట విపక్షం ఓట్లలో చీలిక తెస్తే కచ్చితంగా అది వైసీపీకే మేలు చేసేలా ఉంటుంది. అయితే రాజకీయాల్లో ఈ లెక్కలు బాగా తెలిసిన వారంతా ముద్రగడ అధికార పక్షాన్ని రక్షించడానికే ఇలా రంగంలోకి దిగారని అనుమానిస్తున్నారు. అదే టైమ్ లో ముద్రగడ ఈ రోజుకీ చంద్రబాబుని బాహాటంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక ఆయన కాపు ఉద్యమాలు చేసినదంతా టీడీపీ హయాంలోనే.
దాంతో ముద్రగడ ఈ ప్రకటన చేయగానే ఆయమ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారుట. ముద్రగడను విమర్శిస్తూ చెలరేగిపోతున్నారుట. దీంతో ముద్రగడ మరో మారు బహిరంగ లేఖ రాశారు. ఆయన ఈసారి ఒక హెచ్చరికను ఇచ్చేలాగానే లేఖ రాయడం విశేషం. నేను ఇలాంటి వాటికి భయపడతానా అంటూ గర్జిస్తున్నారు. నన్ను సోషల్ మీడియాలో బండ బూతులు తిడుతూ పోస్టింగులు పెడుతున్నారని ఆరోపించారు. పైగా ఆ రెండు కులాలు అంటూ రెడ్లు, కమ్మలను లాగారు. దాంతో చంద్రబాబు మార్క్ కాపు కమ్మా ఫార్ములాకు ఇది పూర్తిగా వ్యతిరేక ఫ్రంట్ అని అర్ధమవుతోంది.
ఇటీవలి రాజకీయాల్లో నల్లటి బురద రాసుకుని ఇతరులకు అంటించడం పరిపాటి అయిందని తాజాగా రాసిన ఆ లేఖలో ముద్రగడ మండిపడ్డారు. పని చేస్తున్న వారిని దొంగలు, దగాకోరులు అని చెప్పించడం సాధారణ అంశంగా మారిందని అన్నారు. కాపులు, బీసీలు, దళితులు ఏకం కావాలని తాను కోరుకోవడంలో తప్పేముందని ఆయన అన్నారు. ఎంతసేపూ అల్పసంఖ్యాక జనాలకేనా అధికారం దక్కాలా. వీరంతా పల్లకీ మోసే బోయీలుగా మారాలా అని ముద్రగడ సూటిగా ప్రశ్నించారు.
మొత్తానికి చూస్తే తాను ఎవరికీ జడిసే రకాన్ని కాదని ముద్రగడ ఇచ్చిన లేటెస్ట్ వార్నింగ్ ఎవరిని ఉద్దేశించి అని మరో చర్చ మొదలైంది. అంతే కాదు, ఒక లేఖ రాసి గమ్మున ముద్రగడ ఉన్నారనుకున్న వారిని నిరాశపరుస్తూ తాను రేసులో ఉన్నానని, దూసుకువస్తానని ముద్రగడ ఘటాపధంగా చెప్పడంతో ఏపీ రాజకీయాల్లో మరెన్ని ట్విస్టులు చోటుచేసుకుంటాయో చూడాలి.