టీడీపీ అధినేత చంద్రబాబుకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ రాశారు. ఈ మధ్య మీ శ్రీమతికి జరిగిన అవమానం గురించి మీరు వెక్కి వెక్కి ఏడ్వడం టీవీలో చూసి ఆశ్చర్యపోయానని.. మా జాతికి ఇచ్చిన హామీని అమలు చేయమని ఉద్యమం చేస్తే.. నన్ను నా కుటుంబాన్ని మీరు చాలా అవమాన పరిచారు.. మీ కుమారుడు లోకేష్ ఆదేశాలతో పోలీసులు నన్ను బూటుకాలితో తన్నారు.
నా భార్య, కుమారుడు , కోడల్ని బూతులు తిడుతూ లాఠీలతో కొట్టారు. 14 రోజుల పాటు ఆస్పత్రి గదిలో నన్ను, నా భార్యను ఏ కారణంతో బంధించారు. మీ రాక్షస ఆనందం కోసం ఆస్పత్రిలో మా దంపతులను ఫొటోలు తీయించి చూసేవారు ’ అంటూ లేఖలో ముద్రగడ కడిగేశారు.
మీరు చేసిన హింస తాలుకూ అవమానాన్ని తట్టుకోలేక ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాం.. అణిచివేతతో మా కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలన్నది మీ ప్రయత్నం కాదా? అని ముద్రగడ ప్రశ్నించారు.
నా కుటుంబాన్ని అవమానపరిచిన మీ పతనం నా కళ్లతో చూడాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నానని ముద్రగడ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కుటుంబాన్ని ఎంతగానో అవమానించిన మీ నోటి వెంట ఇప్పుడు ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.
మీ బంధువులు, మీ మీడియా ద్వారా సానుభూతి పొందే అవకాశం మీకే వచ్చిందని ముద్రగడ ఎద్దేవా చేశారు. ఆ రోజు నాకు సానుభూతి రాకుండా ఉండేందుకు మీడియాను బంధించి నన్ను అనాథను చేశారు.. శపథాలు చేయకండి చంద్రబాబు గారు.. అవి మీకు నీటి మీద రాతలని గ్రహించండి అంటూ లేఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు ముద్రగడ.