మహమ్మద్ అలీ కుమారుడు కూడా

Update: 2017-02-25 13:00 GMT
అక్ర‌మ వ‌ల‌స దారుల‌ను నిరోధించ‌డం, ఏడు ముస్లిం దేశాల‌కు చెందిన వారిని క‌ట్ట‌డి చేసేందుకు అమెరికా ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన నిబంధ‌న‌లు ఇప్పుడు ఆ దేశ పౌరుల‌ను సైతం ఇర‌కాటంలో ప‌డేస్తోంది. ఏకంగా ప్ర‌ముఖులు - వారి వార‌సుల‌కు సైతం ఇక్క‌ట్లు త‌ప్ప‌డం లేదు. తాజాగా బాక్సింగ్ యోధుడు మహమ్మద్ అలీ కుమారుడు కూడా ఈ వేధింపుల ప‌ర్వంలో చేరిపోయాడు. మ‌హమ్మద్‌ అలీ కుటుంబ అడ్వకేట్ క్రిస్ అభిప్రాయం ప్ర‌కారం మహమ్మద్ అలీ జూనియర్ తన తల్లి కైల్హా కామ్ చో అలీతో క‌లిసి జమైకాలో బ్లాక్ హిస్టరీ మంత్ ఈవెంట్ లో పాల్గొని తిరిగివ‌స్తూ ఫిబ్రవరి 7న ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డల్ హాలీవుడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఈ సంద‌ర్భంగా వారికి ఊహించ‌ని ప్ర‌శ్న‌లు వేస్తూ అక్క‌డి అధికారులు రెండు గంట‌ల పాటు ఇంట‌రాగేష‌న్ చేశారు.

మహమ్మద్ అలీ జూనియర్ త‌ల్లిని పెద్దగా ప్ర‌శ్న‌లు ఏవీ వేయ‌న‌ప్ప‌టికీ పేరులో మ‌హ‌మ్మ‌ద్ అని ఉండ‌టంతో ప్ర‌ముఖ బాక్సర్ త‌న‌యుడిని నువ్వు ఏ మ‌తానికి చెందిన వ్య‌క్తివి అంటూ ప‌దే ప‌దే ప్ర‌శ్నించారు. నువ్వు ముస్లిం క‌దా? ఇంత‌కీ నీ పేరుతో ఆ ప‌దం ఎలా వ‌చ్చింది అంటూ ప్ర‌శ్న‌లు అడిగారు. దీనికి తాను ముస్లింనే అనే స‌మాధానాన్ని జూనియ‌ర్ అలీ ఇచ్చాడు. దీంతోపాటుగా మ‌రిన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌డంతో వారిని వ‌దిలిపెట్టారు. అయితే ఈ ప‌రిణామంపై మ‌హమ్మ‌ద్ అలీ కుటుంబ స‌భ్యులు తీవ్ర క‌ల‌త చెందారని, త‌మ లాగా మ‌రెంత మందినో అమెరికాలో వేధిస్తున్నార‌ని త‌న‌తో చెప్పిన‌ట్లు అడ్వ‌కేట్ క్రిస్ తెలిపారు. ముస్లింల‌పై క‌క్ష గ‌ట్టిన డొనాల్డ్ ట్రంప్ విధానాల వ‌ల్లే ఇలా జ‌రుగుతోంద‌ని వారు వ్యాఖ్యానించిన‌ట్లు స‌మాచారం. అయితే ఈ ఘ‌ట‌న‌ను ఇంత‌టితో వ‌దిలేయ‌డం లేద‌ని, త్వ‌ర‌లో కోర్టులో కేసు వేయ‌నున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News